వింతలకే వింత : అన్నీ రెండేసి అవయవాలతో పుట్టిన పిల్లాడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

egypt boy born with double penis,two scrotums : వింత శిశువులు పుట్టారని చాలాసార్లు వార్తల్లో విన్నాం.కానీ ఓ పిల్లాడు మాత్రం చాలా అంటే చాలా వింతగా పుట్టాడు.అన్నీ రెండే అవయవాలతో పుట్టాడు. ఆ పిల్లాడికి మల, మూత్ర విసర్జనకు సంబంధిచించిన అన్నీ అవయవాలు రెండేసి ఉన్నాయి. అంతేకాదు మగపిల్లాడు కాబట్టి రెండు అంగాలతో రెండు వృషణ సంచులతో పుట్టాడు. ఆ పిల్లాడిని చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఈ వింత శిశువు ఈజిప్టులోని అస్సియట్ యూనివర్శిటీ చిల్డ్రన్ హాస్పిటల్‌లో జన్మించాడు.రెండు పురుషాంగాలు, రెండు వృషణ సంచులతో పుట్టిన ఈ పిల్లాడికి రెండు పురుషాంగాలకు రెండు మూత్ర నాళికలు కూడా ఉండటం మరో విశేషమంటున్నారు డాక్టర్లు. అంటే.. ఈ పసివాడు రెండు పురుషాంగాల నుంచి మూత్రం పోయగలడన్నమాట. అంతేకాదు.. ఈ వింత పిల్లాడికి రెండు మలద్వారాలు కూడా ఉన్నాయి.జనగణమన పాడలేకపోయిన విద్యాశాఖ మంత్రి.. ట్విట్టర్‌లో విమర్శలు


అంతేకాదు ఆ పిల్లాడి శరీరంలో పెద్ద పేగులు కూడా రెండు ఉన్నాయట.రెండు అంగాలకు చెరొక వృషణ సంచి ఉండంతో ఆ రెండు అంగాల్లో వీర్యవృద్ధి కూడా జరుగుతుందని డాక్టర్లు తెలిపారు. కానీ ఇవి భవిష్యత్తులో అతనికి ఇబ్బంది కలుగవచ్చని అంటున్నారు.ఎందుకంటే రెండు పురుషాంగాలు ఉండటం వల్ల దాంపత్య జీవితానికి (లైంగిక జీవితం )కష్టంకావచ్చని అంటున్నారు.ఈ అదుదైన శిశువు గురించి పీడియాట్రిక్ సర్జరీ నిపుణులు అహ్మద్ మహెర్ అలీ మాట్లాడుతూ..ఇటువంటి శిశువులు అత్యంత అరుదుగా జన్మిస్తుంటారనీ.. కాడల్ డూప్లికేషన్ సిండ్రోమ్ (Caudal Duplication Syndrome – CDS) అంటారని తెలిపారు.


తల్లి గర్భంలో పెరిగే కవలలు.. పూర్తిగా విడివడకపోతే..ఇటువంటి సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. ఇలా పుట్టిన పసివాళ్లకు రెండేసి అవయవాలు ఉంటాయని, వాటిని విడదీయడం చాలా కష్టమని..సర్జరీ చేసే సమయంలో అత్యంత జాగ్రత్త వహించకపోతే వారి ప్రాణాలకే ప్రమాదమని అన్నారు.ఈ పసివాడికి ఉన్న రెండు అంగాలకు రెండేసి వృషణ సంచులు ఉన్నాగానీ..పసివాడు ఆరోగ్యంగానే ఉన్నాడని..16 నెలల తర్వాత వాటిలో ఒకటి మాత్రమే పనిచేసేలా సర్జరీ చేస్తామన్నారు. ఈ ఆపరేషన్ ప్రత్యేక సర్జరీ నిపుణులతో జరగాల్సి ఉంటుందని తెలిపారు.

Related Tags :

Related Posts :