బెల్లీ డ్యాన్సర్‌కు రూ.14లక్షల జరిమానా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మన దగ్గర తక్కువే కానీ, బయటి దేశాల్లో బెల్లీ డ్యాన్స్ కు ఫుల్ క్రేజ్. ఈజిప్షియన్ బెల్లీ డ్యాన్సర్ సామా ఎల్ మాస్రీకు మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు 18వేల 500 అమెరికన్ డాలర్లు జరిమానాగా విధించారు. సోషల్ మీడియా పోస్టింగుల్లో అసభ్యకరంగా పోస్టు చేసి సొసైటీలో దుష్ప్రచారం చేస్తుందని అధికారులు కేస్ ఫైల్ చేశారు. టిక్ టాక్ లో పోస్టు చేసిన వీడియో యథేచ్చగా సెక్స్ చేసుకోవచ్చనే కాన్సెప్ట్ తో ఉంది.

42ఏళ్ల డ్యాన్సర్ పై ఆరోపణలు గుప్పుమనడంతో ఆ కంటెంట్ తన ఫోన్ నుంచి దొంగిలించి గుర్తు తెలియని వ్యక్తులు పోస్టు చేశారని చెప్పుకొచ్చింది. కైరో ఈజిప్టు కుటుంబ నియమాలు ఉల్లంఘించిందని సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు చేస్తుందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ఈ సందర్భంగా స్వేచ్ఛకు యథేచ్చకు వ్యత్యాసం ఉంటుందని ఆమె అది తెలుసుకోలేకపోయిందని ఎంపీ జాన్ టలాట్ అన్నారు. ఎల్ మెస్రీ ఇతర టిక్ టాక్ అకౌంట్ హోల్డర్లు చట్ట వ్యతిరేక చర్యలకు ఆదేశించారు. ‘మన సొసైటీ టెక్నాలజీ మార్పులతో ఇబ్బంది పడుతుంది. పలు రకాల మైండ్ సెట్ల మధ్య బతుకుతున్నామని’ థామ్సన్ ర్యూటర్స్ ఫౌండేషన్ చెబుతుంది.

Related Posts