Home » భార్యని కొడితే జైలుకే..ఐదేళ్ల జైలు..జరిమానా కూడా
Published
4 weeks agoon
Egypt: Wife beaters could face 5 years in jail : భార్యలను తిడుతూ..కొడుతూ..హింసించే భర్తలకు ప్రభుత్వం షాకిచ్చింది. భార్యల్ని కొడితే జైలుకు వెళ్లాల్సిందేనంటోంది. భార్యలను కొట్టే భర్తలకు భయం పుట్టేలా ఈ కొత్తరకంగా రూపొందుతోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే భార్యపై చేయి ఎత్తాలంటే భర్తకు షాకేనన్నమాట.. ఈ చట్టంప్రకారం భార్యల్ని కొట్టి, హింసిస్తే భర్తలకు ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టానికి రూపకల్పన జరుగుతోంది. ఈ కొత్త చట్టంలో ఇంకా ఏమేం అంశాలు ఉన్నాయంటే..
మహిళలు ఎంత ప్రగతి సాధిస్తున్నా..వారిపై హింసలు మాత్రం తగ్గటంలేదు. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. హత్యలు, అత్యాచారాలు, కుటుంబ హింసలు జరగని నిమిషం అంటూ ఉండదంటే అతిశయోక్తి లేదు. కుటుంబ కలహాలతో భార్యలమీద దాడులకు పాల్పడే భర్తలు, కట్నం కోసమో,ఆధిపత్యం కోసమో కారణం ఏదైనాగానీ..దాడులు,హింసలు కొనసాగుతున్నాయి. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉండే అన్ని దేశాల్లోను జరుగుతున్నాయి. ఎన్ని చట్టాలను వచ్చినా ఇవి మాత్రం తగ్గటంలేదు.
ఈ క్రమంలో ఈజిప్టులో ఓ వినూత్న చట్టం గురించిన ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. భార్యలను కొట్టి, హింసింసే భర్తలకు ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టానికి రూపకల్పన జరుగుతోంది. జరిమానాలను కూడా విధించేలా ఆ చట్టంలో అంశాలను రూపొందించారు. ఇళ్లల్లో మహిళలకు రక్షణ కల్పించే దిశగా ఈజిఫ్టు ఎంపీ అమల్ సలమా తీవ్ర కృషి చేస్తున్నారు. ఈ చట్టానికి సంబంధించిన డ్రాఫ్ట్ కాపీని ఆమె రూపొందిస్తున్నారు. భార్యను కొట్టాలంటేనే భర్తలు భయపడాలని కారణం ఏదైనా సరే ఓమనిషిని సాటి మనిషి కొట్టటం సరికాదంటోందీ చట్టం.
కారణం ఏదైనా సరే భార్యలను కొట్టేవారికి మూడు నుంచి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించేలా, జరిమానా విధించేలా చట్టంలో పలు అంశాలను ఆమె పొందుపరుస్తున్నారు. దీనికి సంబంధించిన చట్టాన్ని త్వరలోనే ఈజిప్టు పార్లమెంట్ లో ప్రవేశ పెడతామనీ, సభ్యుల మద్ధతును కూడగడతానని అమల్ సలమా తెలిపారు. ’హింసించడం, కొట్టడం చేసే మగాళ్లు భార్యల దృష్టిలో బలవంతులు, గొప్పవాళ్లు అని భర్తలు ఫీలవుతుంటుంటారు. ఆధిపత్యంకోసమో లేక వారి బలాన్ని నిరూపించుకోవటం కోసం భార్యల్ని కొడుతుంటారు. మానసకంగా..శారీరకంగా హింసిస్తుంటారు. ఈజిప్టులోనే కాదు, పలు దేశాల్లో మహిళలు ఇప్పటికీ స్త్రీలు గృహహింసను ఎదుర్కొంటున్నారు.
ఇది గ్రామీణ కుటుంబాల్లో మరీ ఎక్కువగా ఉన్నాయని..భర్తలు పెట్టే హింసను భరించలేక భార్యలు ఆత్మహత్యలకు పాల్పడే సందర్భాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. స్త్రీలకు రక్షణ, ధైర్యం కల్పించేందుకే ఈ కొత్త చట్టానికి రూపకల్పన చేయాలనుకున్నామని తెలిపారు. దీన్ని పార్లమెంట్ ఆమోదించేలా కృషి చేస్తా‘ అని అమల్ సలమా చెప్పుకొచ్చారు. ఈజిప్టులో రూపకల్పన జరుగుతున్న ఇలాంటి చట్టం భారత్ లో కూడా ఉంటే బాగుంటుంది కదా అని సగటు భారతీయ మహిళలు సోషల్ మీడియాల్లో డిమాండ్ చేస్తుండటం గమనించాల్సిన విషయం. మరి భారత్ లో కూడా ఇటువంటి చట్టాలొస్తే కోర్టులో ఇటువంటి కేసులు మేటల్లా పేరుకుపోవటం ఖాయమంటున్నారు మహిళా వాదులు.
హంతకురాలు గుండెపోటుతో చనిపోయినా ఉరిశిక్ష అమలు, కోడలిపై కసి తీర్చుకున్న అత్త
భార్య శీలాన్ని శంకించిన కలియుగ భర్త
చీరతో భర్తను హత్య చేసిన భార్య, కారణం తెలిస్తే మంచి పని చేసిందంటారేమో
గర్భవతి అని తెలిసినా కోరిక తీర్చమని వేధింపులు…
భార్యా రూపవతి శత్రువు – పెళ్లైన ఆర్నెల్లకే భార్యను హత్య చేసిన భర్త
ప్రియుడితో కలిసి భర్తను చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఇల్లాలు