Eid 2020 : BSNL announces Rs 699 and Rs 786 prepaid plans

BSNL Special : ఈద్ ప్రీపెయిడ్ ప్లాన్..ఫుల్ టాక్ టైం, 30 GB Data

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రభుత్వ రంగ సంస్థ అయిన..BSNL ఇతర కంపెనీలతో పోటీ పడుతోంది. వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇతర ప్రైవేటు రంగాలకు ధీటుగా ప్లాన్స్ అమల్లోకి తెస్తోంది. తాజాగా స్పెషల్ ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలు పవిత్ర సంఖ్యగా భావించే 786 నంబర్ తో ఈ ప్లాన్ తీసుకరావడం విశేషం.

మరో ప్లాన్ ధర రూ. 699గా నిర్ణయించింది. ఇప్పటికే STV 118, COMBO 18 ప్రీ పెయిడ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది బీఎస్ఎన్ఎల్. అన్ని సర్కిల్స్ లో ఈ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయని బీఎస్ఎన్ఎల్ అధికారులు వెల్లడించారు. 

రూ. 786 : రూ. 786 టాక్ టైం. 30 GB, హై స్పీడ్ డేటా. 90 రోజుల గడువు. 2020, జూన్ 21 వరకు రీ ఛార్జ్ చేసుకొనే సౌకర్యం. 

రూ. 699 ప్రీ పెయిడ్ ప్లాన్ : ఈద్ స్పెషల్ ప్లాన్ తో పాటు, BSNL రూ. 699 ప్రీ పెయిడ్ ప్లాన్ ను కూడా విడుదల చేసింది. మొత్తం 500 MB డేటాతో పాటు ఏ నెట్ వర్క్ కు అపరిమిత కాలింగ్ సదుపాయం ఉంది. రోజుకు 100 SMS లు. 160 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. 

BSNL కాంబో 18 డేటా ప్లాన్ : రెండు రోజుల స్వల్ప కాలికం. పుదుచ్చేరి, లక్ష్యదీప్ తో సహా 22 సర్కిళ్లలో లభిస్తుంది. 30 GB హై స్పీడ్ డేటా ఉంది. డేటా లిమిట్ అయిపోయిన తర్వాత వేగం 80 KBPS కు తగ్గిపోతుంది. ఇతర నెట్ వర్క్ లకు ఉచిత కాలింగ్ సదుపాయం. 

Read: కొత్త Cibil స్కోరింగ్ మెథడ్ : మీ క్రెడిట్ స్కోరు తగ్గిందేమో చెక్ చేసుకోండి!

Related Posts