Home » GHMC కార్యాలయంలో పెరిగిపోతున్న కరోనా కేసులు :అడిషనల్ కమిషన్ అడ్మిన్ ఉగ్యోగికి పాజిటివ్
Published
7 months agoon
By
nagamaniGHMC కార్యాలయంలో కరోనా కేసులు రోజురోజుపెరుగిపోతున్నాయి. బల్దియా ప్రధాన కార్యాలయంలో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అడిషనల్ కమిషన్ అడ్మిన్ పేషీలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతని కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్ కు తరలించారు.
కొన్ని రోజుల క్రితం ఇదే డిపార్ట్ మెంట్ లో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈక్రమంలో మరో ఉద్యోగికి పాజిటివ్ రావటంతో ఇప్పటి వరకూ GHMC కార్యాలయంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఎనిమిదికి చేరింది. కాగా తెలంగాణలో కరోనా మహమ్మారి ఏమాత్రం తగ్గటంలేదు. రోజురోజుకు ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తూ..ఈరోజుకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 14వేల 419కు చేరింది. దీంట్లో సగం అంటే 20వేలు హైదరాబాద్ నగరంలోనే నమోదు కావటం గమనించాల్సిన విషయం. ఎక్కువ జనాభా కలిగిన హైదరాబాద్ లో కరోనా కేసులు నమోదు రోజు రోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Read:జులై 3 నుంచి మరింత కఠినంగా హైదరాబాద్లో 15రోజులు లాక్డౌన్?