లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

రాజ్ భవన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం..ఇద్దరి పరిస్థితి విషమం

Published

on

Major Fire near Odisha Raj Bhavan  ఒడిశా రాజధాని భువనేశ్వర్ ​లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం(అక్టోబర్-7,2020)మధ్యాహ్నాం రాజ్​భవన్​ సమీపంలోని ఓ పెట్రోల్​ బంకులో పేలుడు కారణంగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.
భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలను అదుపుచేసేందుకు 6 ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నాయి. పెట్రోల్​ బంకులోని ఇంధనం నిల్వ ఉన్న రెండు ట్యాంకుల్లో.. ఒకటి పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి చెప్పారు.

ఈ పేలుడు ఘటనలో 8 మందికి గాయాలయ్యాయని ఓ పోలీస్​ అధికారి తెలిపారు. ట్మీట్మెంట్ కోసం క్షతగాత్రులను కటక్ లోని SCB మెడికల్ కాలేజి అండ్ హాస్పిటల్ కు తరలించినట్లు తెలిపారు. కాగా, క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *