లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్…NCPలోకి ఏక్​నాథ్​ ఖడ్సే

Published

on

Eknath Khadse Quits BJP For NCP మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్​ నాయకుడు ఏక్​నాథ్​ ఖడ్సే.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీకి తాను రాజీనామా చేయడానికి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కారణమని ఈ సందర్భంగా ఏక్​నాథ్​ ఖడ్సే తెలిపారు. దేవేంద్ర ఫడ్నవీస్ తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించారు. ఏక్​నాథ్​ ఖడ్సే శుక్రవారం ఎన్సీపీ(Nationalist Congress Party)లో చేరనున్నట్లు సమాచారం.కాగా,గత బీజేపీ ప్రభుత్వంలో ఫడ్నవీస్ కేబినెట్ లో ఏక్​నాథ్​ ఖడ్సే మంత్రిగా ఉండగా… 2016లో అవినీతి ఆరోపణల్లో భాగంగా ఏక్​నాథ్ తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఏక్ నాథ్ ఖడ్సే…తన సెల్ ఫోన్ ద్వారా భూమికి సంబంధించిన సెటిల్మెంట్ చేశారనీ, అలాగే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం నుంచి ఆయన ఫోన్ కు కాల్స్ వచ్చాయన్న ఆరోపణలనూ ఎదుర్కొంటున్న నేపథ్యంలో పార్టీ ఒత్తిడి మేరకు ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.నాటి నుంచి ఏక్​నాథ్​ ఖడ్సే పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్ లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏక్​నాథ్​ ఖడ్సే కు టిక్కెట్ దక్కలేదు. ఆయనకు బదులుగా ఆయన కుమార్తెను బీజేపీ అసెంబ్లీ బరిలో దింపగా ఆమె ఓటమి పాలైంది. ఇక,ఈ ఏడాది మే నెలలో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో కూడా ఏక్​నాథ్​ ఖాడ్సే ను నిలబెట్టకుండా వేరే వారికి బీజేపీ అవకాశం కల్పించింది. తనను పక్కకు పెట్టడం వెనుక ముఖ్య సూత్రధారి దేవేంద్ర ఫడ్నవీస్ అని ఏక్​నాథ్ ఖడ్సే ఆరోపించారు.

ఎన్నికలకు వచ్చిన 876కోట్ల డొనేషన్లలో బీజేపీకి వచ్చిందే 698కోట్లు


అయితే,శుక్రవారం(అక్టోబర్-23,2020) మధ్యాహ్నాం 2గంటలకు ఏక్​నాథ్​ ఖడ్సే.. ఎన్పీపీలో చేరనున్నట్లు ఎన్పీపీ స్టేట్ చీఫ్,మహారాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ తెలిపారు. ఏక్​నాథ్​ ఖడ్సే చేరికతో ఎన్సీపీ మరింత బలపడుతుందని పాటిల్ అన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *