ఏపీ ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకోవడానికి సీఎస్‌ను కలుస్తాం: నిమ్మగడ్డ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Election commission : ఏపీలో రాజకీయ పార్టీలతో సమావేశం, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి SEC ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఎలక్షన్ కమిషన్ 19 పార్టీలకు ఆహ్వానం పంపిందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. 11 పార్టీలు ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషనర్‌ను కలిసి వినతులు ఇచ్చాయని ఆయన చెప్పారు.జనసేన, జనతాదళ్ పార్టీలు మాత్రం మెయిల్ ద్వారా వినతులు పంపాయన్నారు. ఇక వైసీపీ, కాంగ్రెస్ సహా 8 పార్టీలు సమావేశానికి హాజరుకాలేదన్నారు. ఏపీ ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకునేందుకు సీఎస్‌ను కలుస్తాం ఎస్ఈసీ రమేశ్ కుమార్ తెలిపారు.

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వంతో ముందుగా సంప్రదించాలనడం ఆశ్చర్యం కలిగించిందని నిమ్మగడ్డ చెప్పారు. పారదర్శక విధానాన్ని అమలంభిస్తున్నా ఎన్నికల నిర్వహణపై హైకోర్టుకు వెళ్లడం బాధ కలిగించిందని ఎస్ఈసీ రమేశ్ పేర్కొన్నారు.
ఏపీలో ఎన్నికల కమిషన్ భేటీకి 19 పార్టీలకు ఆహ్వానం పంపగా.. భేటీకి 11 పార్టీలు హాజరయ్యాయి. భేటీకి హాజరుకావడం లేదని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందే స్పష్టం చేసింది.

మెయిల్ ద్వారా జనసేన పార్టీ తమ అభిప్రాయాన్ని తెలిపింది. రాజ్యాంగబద్ద సంస్థ తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని జనసేన పేర్కొంది. 7 పార్టీలు ఈ భేటీకి గైర్హాజరయ్యాయి.

Related Tags :

Related Posts :