Gujarat Polls: గుజరాత్ బరిలో 1,621 మంది అభ్యర్థులు.. అత్యధికులు బీజేపీ నుంచే

కాంగ్రెస్ పార్టీ నుంచి 179 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల ముందు పొత్తులో భాగంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి మూడు స్థానాలు కేటాయించారు. అయితే దేవగఢ్ స్థానం నుంచి ఎన్సీపీ తప్పుకుంది. దీంతో ఆ పార్టీ రెండు స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ సైతం 182 స్థానాల్లో అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. అయితే సూరత్ ఈస్ట్ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకోవడంతో 181 స్థానాల్లో ఆప్ పోటీలో ఉంది.

Gujarat Polls: గుజరాత్ బరిలో 1,621 మంది అభ్యర్థులు.. అత్యధికులు బీజేపీ నుంచే

1,621 candidates in fray for Gujarat Assembly elections

Gujarat Polls: వచ్చే నెల రెండు దశల్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నిల్లో 1,621 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మొదటి విడతలో డిసెంబర్ 1న 89 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఇక రెండవ విడతలో డిసెంబర్ 5న 93 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. కాగా, అధికార భారతీయ జనతా పార్టీ 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది అభ్యర్థులు బీజేపీ నుంచే ఉన్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి 179 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల ముందు పొత్తులో భాగంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి మూడు స్థానాలు కేటాయించారు. అయితే దేవగఢ్ స్థానం నుంచి ఎన్సీపీ తప్పుకుంది. దీంతో ఆ పార్టీ రెండు స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ సైతం 182 స్థానాల్లో అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. అయితే సూరత్ ఈస్ట్ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకోవడంతో 181 స్థానాల్లో ఆప్ పోటీలో ఉంది.

వీళ్ల అనంతరం, ఏఐఎంఐఎం పార్టీ గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఆ పార్టీ 14 స్థానాల్లో అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. అయితే బాపూనగర్ నుంచి అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారు. మొదటి విడతలో89 స్థానాలకు జరిగే పోలింగులో 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక రెండవ విడతలో 93 నియోజకవర్గాలకు జరిగే పోలింగులో 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Assam-Meghalaya Border: అసోం-మేఘాలయ సరిహద్దులో అటవీ అధికారుల కాల్పులు.. ఐదుగురు మృతి