MCD Polls: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ గెలిచింది.. కానీ సినిమా ఇంకా మిగిలే ఉంది

కాంగ్రెస్ పార్టీ నుంచి 9 మంది గెలుపొందారు. ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. వీరి లెక్క 12. వీరిలో ఎవరైనా ఎప్పుడైనా బీజేపీ గుడారంలోకి వెళ్లే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఒక్క 10 మంది కార్పొరేటర్లు కనుక కమలానికి మద్దతు ఇస్తే, ఢిల్లీ మున్సిపల్ పీఠానికి సరిపడా మద్దతు బీజేపీకి దక్కుతుంది. అయితే మేయర్ ఎన్నికల్లో లెఫ్టినెంట్ గవర్నర్ నియమించే 12 మంది కార్పొరేటర్లు ఓటు వేస్తారా అనే విషయమై ఇప్పటికైతే స్పష్టత లేదు.

MCD Polls: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ మార్కును దాటి సీట్లు సంపాదించింది. 15 ఏళ్ల భారతీయ జనతా పార్టీ పాలనకు చరమగీతం పాడింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల విడుదల తుది దశకు వచ్చినప్పటి నుంచి వినిపిస్తున్న మాటలివి. నిజమే.. ఢిల్లీ మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలంటే 126 సీట్లు కావాలి. కానీ ఆప్ అంత కంటే 12 ఎక్కువే, అంటే 134 సీట్లు సంపాదించింది. ఇక్కడికి విజయం ఖరారైనట్లే. అయితే ఇంతటితోనే కథ ముగిసిపోలేదు అంటున్నారు రాజకీయ పండితులు.

MCD Polls: కాంగ్రెస్ మరీ ఇంతలానా? ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పత్తాలేని హస్తం పార్టీ

ఈ ఎన్నికల్లో రెండవ స్థానంలో ఉన్న బీజేపీ 104 స్థానాలు గెలుచుకుంది. అయితే మరో 12 స్థానాల్లో అభ్యర్థులు నామినేట్ అవుతారు. వీరందరినీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ నియమితులైన లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్రంలోని బీజేపీ సూచించిన అభ్యర్థుల్నే నామినేట్ చేస్తారని వేరే చెప్పనక్కర్లేదు. దీంతో బీజేపీ లెక్క 116కు చేరుతుంది. ఈ లెక్క ప్రకారం.. ఇది ఆప్ గెలిచిన స్థానాలకు అతి దగ్గరగా ఉండే నంబర్. పైగా మెజారిటీకి 10 స్థానాల దూరంలో ఉన్న నంబర్.

MCD Polls: రాజ్యాన్ని గెలిచి రాజధానిలో నెగ్గని బీజేపీ.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమితో ఢిల్లీపై మరింత పట్టు సడలింది

వీళ్లు పోగా, కాంగ్రెస్ పార్టీ నుంచి 9 మంది గెలుపొందారు. ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. వీరి లెక్క 12. వీరిలో ఎవరైనా ఎప్పుడైనా బీజేపీ గుడారంలోకి వెళ్లే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఒక్క 10 మంది కార్పొరేటర్లు కనుక కమలానికి మద్దతు ఇస్తే, ఢిల్లీ మున్సిపల్ పీఠానికి సరిపడా మద్దతు బీజేపీకి దక్కుతుంది. అయితే మేయర్ ఎన్నికల్లో లెఫ్టినెంట్ గవర్నర్ నియమించే 12 మంది కార్పొరేటర్లు ఓటు వేస్తారా అనే విషయమై ఇప్పటికైతే స్పష్టత లేదు. అయితే మేయర్ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ గ్రూపు వంటి సమస్యలు లేనందున ఏ పార్టీ నుంచి ఎవరైనా ఎటు వైపైనా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్, స్వతంత్ర కార్పొరేటర్లు సహా, ఆప్‭లోని కొద్ది మందిని బీజేపీ మ్యానేజ్ చేసినా, ఎన్నికల తీర్పు తలకిందులవ్వొచ్చని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు