MCD Polls: ఢిల్లీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం.. బలం చాలక వెనక్కి తగ్గిన బీజేపీ

గతంలో ఉన్న మూడు కార్పొరేషన్లను విలీనం చేసి ఒకే మున్సిపాలిటీగా మార్చిన అనంతరం డిసెంబర్ 4న ఎన్నికలు జరిగాయి. మొత్తం 272గా ఉన్న స్థానాలను 250కి కుదించారు. దాదాపుగా 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీని తమ గుప్పిట్లో పెట్టుకున్న కమలం పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోయింది

MCD Polls: ఢిల్లీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం.. బలం చాలక వెనక్కి తగ్గిన బీజేపీ

MCD house

MCD Polls: ఢిల్లీ మేయర్ ఎన్నికల నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తప్పుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి షెల్లీ ఒబేరాయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్‌గా గెలుపొందేందుకు తగినంత బలం లేకపోవడంతో బీజేపీ వెనక్కి తగ్గింది. ఇక డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా అలాగే జరిగింది. ఈ పోటీ నుంచి సైతం కాషాయ పార్టీ తప్పుకోవడంతో ఆప్ అభ్యర్థి ఆలీ మహమ్మద్ ఇక్బాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చాలా రోజులుగా తీవ్ర గందరగోళం, తీవ్ర ఉద్రిక్తల నడుమ అనేక వాయిదాలు పడుతూ వచ్చిన ఈ ఎన్నిక.. ఎట్టకేలకు ప్రశాంతమైన వాతావరణంలో ముగిసింది. ఎన్నిక ప్రక్రియ పూర్తవగానే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సభా కార్యకలాపాలను మే 2కు వాయిదా వేస్తున్నట్లు మేయర్ షెల్లీ ఒబెరాయ్ ప్రకటించారు.

Kerala: వందే భారత్ రైలుపై పోస్టర్లు అంటించి కాంట్రవర్సీకి కాలు దువ్విన కాంగ్రెస్

గతంలో ఉన్న మూడు కార్పొరేషన్లను విలీనం చేసి ఒకే మున్సిపాలిటీగా మార్చిన అనంతరం డిసెంబర్ 4న ఎన్నికలు జరిగాయి. మొత్తం 272గా ఉన్న స్థానాలను 250కి కుదించారు. దాదాపుగా 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీని తమ గుప్పిట్లో పెట్టుకున్న కమలం పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించడమే కాకుండా, మేయర్ ఎన్నికకు అవసరమైన మెజారిటీ సాధించింది. అయితే ఇరు పార్టీల మధ్య రాజకీయ తగాదాల కారణం ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు నాలుగు నెలల తర్వాత ఈ ప్రక్రియ పూర్తైంది.