Karnataka Polls: ఎన్నికల ముందు బిగ్ ట్విస్ట్.. దేవెగౌడ, మోదీ చర్చలు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీ, జేడీఎస్!

గత అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన అనంతరం.. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఈ ఎన్నికల్లో కూడా అలాంటిదేమైనా జరిగితే మళ్లీ జేడీఎస్-కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవచ్చనే ఊహాగాణాలు ఉన్నాయి

Karnataka Polls: ఎన్నికల ముందు బిగ్ ట్విస్ట్.. దేవెగౌడ, మోదీ చర్చలు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీ, జేడీఎస్!

Karnataka Elections 2023

Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు పొలిటికల్ బాంబ్ పేలింది. భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ సెక్యూలర్ పార్టీలు చేతులు కలపబోతున్నాయట. ఈ విషయమై జేడీఎస్ అధినేత దేవెగౌడతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్చలు కూడా చేశారని బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ అన్నారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే బీజేపీ-జేడీఎస్ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. అయితే కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందని చెప్పగా, కొన్ని సర్వేలు హంగ్ అసెంబ్లీ ఏర్పడొచ్చని చెబుతున్నాయి.

Gurugram: భార్యను కిరాతకంగా హతమార్చి సాక్ష్యాలు దాచేసిన హంతకుడిని పట్టించిన ప్లాస్టిక్ బ్యాగు

దీంతో హంగ్ ఏర్పడే అవకాశం వస్తే బీజేపీ-జేడీఎస్ కలుస్తాయని బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర ఫలితాలపై నరేంద్రమోదీ, దేవెగౌడల మధ్య సుదీర్ఘమైన చర్చసాగిందని ఆయన అన్నారు. జేడీఎస్‭కు 25కు మించి స్థానాలు రావని, జేడీఎస్‭కు ఓటేసినా బీజేపీకి ఓటేసినా ఒకటేనని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రీతమ్‌ వ్యాఖ్యలు క్షణాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది.

Supreme Court: అతీక్‌, అష్రఫ్‭లను ఎందుకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు? పోలీసులకు సుప్రీం ప్రశ్నలు

ఇరు పార్టీల మధ్య పొత్తును కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొట్టిపారేశారు. దీనిపై తానేమీ స్పందించనని జేడీఎస్ సుప్రీం దేవెగౌడ అన్నారు. అయితే కుమారస్వామి మాత్రం ఖండించారు. అలాంటి చర్చలేమీ జరగలేదని, 123 స్థానాలు గెలిచి తామే అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన అనంతరం.. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఈ ఎన్నికల్లో కూడా అలాంటిదేమైనా జరిగితే మళ్లీ జేడీఎస్-కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవచ్చనే ఊహాగాణాలు ఉన్నాయి. ఇంతలో జేడీఎస్-బీజేపీ పొత్తు అంశం పైకి లేవడంతో కన్నడ రాజకీయం మరింత వేడెక్కింది.