Hamirpur: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నియోజకవర్గంలోని ఐదు స్థానాల్లోనూ ఓడిన బీజేపీ.. స్వల్ప మెజారిటీతో నడ్డా సేఫ్

నడ్డా స్వస్థలం అయిన బిలాస్‭పూర్‭లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను అతి స్వల్ప మెజారిటీతో బీజేపీ గెలుచుకుంది. దీంతో ఆయనకు కాస్త ఊరట లభించింది. ఇక హమిర్‭పూర్‭లోని ఐదు స్థానాల్లో బీజేపీ ఓడటంపై పార్టీ కార్యకర్తలు అనురాగ్ ఠాకూర్‭పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు

Hamirpur: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నియోజకవర్గంలోని ఐదు స్థానాల్లోనూ ఓడిన బీజేపీ.. స్వల్ప మెజారిటీతో నడ్డా సేఫ్

BJP Lost All 5 Seats In Minister Anurag Thakur Constituency

Hamirpur: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నియోజకవర్గంలో ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాల్లోనూ భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. హమిర్‭పూర్ లోక్‭సభ నియోజకవర్గం నుంచి అనురాగ్ ఠాకూర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇకపోతే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రాతినిధ్యం వహిస్తున్న బిలాస్‭పూర్ లోక్‭సభ నియోజకవర్గంలోని మూడు స్థానాల్లోనూ కమలం పార్టీ విజయం సాధించింది.

అనురాగ్ ఠాకూర్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ తరుచూ పోటీ చేసే సుజన్‭పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఈ స్థానంలో కాంగ్రెస్ మెజారిటీ 399 ఓట్లు. వాస్తవానికి ఈసారి ఎన్నికల్లో ధుమాల్‭కు బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆ స్థానంలో ఆయనతో పాటు, పార్టీ కూడా విరమణ తీసుకున్నట్టైంది. బొరంజులో కేవలం 60 ఓట్లతో బీజేపీ అభ్యర్థి ఓడారు. హమిర్‭పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇక బర్సార్, నదౌన్ అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ గెలుచుకుంది.

ఇక నడ్డా స్వస్థలం అయిన బిలాస్‭పూర్‭లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను అతి స్వల్ప మెజారిటీతో బీజేపీ గెలుచుకుంది. దీంతో ఆయనకు కాస్త ఊరట లభించింది. ఇక హమిర్‭పూర్‭లోని ఐదు స్థానాల్లో బీజేపీ ఓడటంపై పార్టీ కార్యకర్తలు అనురాగ్ ఠాకూర్‭పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో రెబెల్స్ బెడద బీజేపీని బాగా ఇబ్బంది పెట్టింది. 68 నియోజకవర్గాల్లో 28 చోట్ల బీజేపీ రెబెల్స్ పోటీ చేశారు. ఇందులో ఇద్దరు విజయం సాధించారు.