UP Civic Polls: కర్ణాటకలో ఓడినా యూపీలో దుమ్ము లేపుతున్న బీజేపీ

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‭వాదీ పార్టీ ఒక్కటంటే ఒక్క మున్సిపల్ కార్పొరేషన్‭లో ముందంజలో లేకపోవడం గమనార్హం. అయితే బహుజన్ సమాజ్ పార్టీ ఒక మున్సిపల్ కార్పొరేషన్‭లో ఆధిక్యం సాగిస్తోంది. ఇక మున్సిపల్ కౌన్సిల్ విషయానికి వస్తే ఇక్కడ కూడా బీజేపీ హవా కొనసాగుతోంది.

UP Civic Polls: కర్ణాటకలో ఓడినా యూపీలో దుమ్ము లేపుతున్న బీజేపీ

BJP Leading: కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో ఓటమి దిశగా వెళ్తోన్న భారతీయ జనతా పార్టీ.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం హవా కొనసాగిస్తోంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం విడుదల అవుతున్నాయి. కాగా, ఈ ఫలితాల్లో బీజేపీ వైట్ వాష్ చేస్తున్నట్లుగానే కనిపిస్తోంది. సమాజ్‭వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలను వెనక్కి నెట్టి.. దాదాపుగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

Karnataka Polls: ఒటమి దిశగా సగం మంది మంత్రులు.. లెక్కింపులో వెనుకబడిన అగ్రనేతలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 199 మున్సిపల్ కౌన్సిల్లు, 544 నగర పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. కాగా, ఈ ఎన్నికల ఫలితాలు శనివారం ఉదయం నుంచి విడుల అవుతున్నాయి. అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల్లో బీజేపీ అఖండ విజయం వైపుగా దూసుకుపోతోంది. ఏకంగా 16 కార్పొరేషన్లలో బీజేపీ ముదంజలో ఉంది. ఇందులో ఝాన్సీ మున్సిపల్ కొర్పొరేషన్లో ఇప్పటికే విజయం ఖరారైంది. మరో 15 కార్పొరేషన్లలోనూ విజయం సాధించే అవకాశం ఉన్నట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

Karnataka Polls: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో పత్తా లేని ఆమ్ ఆద్మీ పార్టీ.. జాతీయ హోదా వచ్చిన మొదటి ఎన్నికల్లోనే దారుణ ఓటమి

ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‭వాదీ పార్టీ ఒక్కటంటే ఒక్క మున్సిపల్ కార్పొరేషన్‭లో ముందంజలో లేకపోవడం గమనార్హం. అయితే బహుజన్ సమాజ్ పార్టీ ఒక మున్సిపల్ కార్పొరేషన్‭లో ఆధిక్యం సాగిస్తోంది. ఇక మున్సిపల్ కౌన్సిల్ విషయానికి వస్తే ఇక్కడ కూడా బీజేపీ హవా కొనసాగుతోంది. నగర పంచాయతీల్లో సైతం ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.

మున్సిపల్ కార్పొరేషన్లు – 17 (లీడిండ్/గెలుపు)
బీజేపీ – 16
బీఎస్పీ – 1

మున్సిపల్ కౌన్సిల్స్ – 199 (లీడిండ్/గెలుపు)
బీజేపీ – 89
ఎస్పీ – 36
బీఎస్పీ – 23
కాంగ్రెస్ – 5
ఇతరులు – 46

నగర పంచాయతీలు – 544 (లీడిండ్/గెలుపు)
బీజేపీ – 151
ఎస్పీ – 72
బీఎస్పీ – 37
కాంగ్రెస్ – 6
ఇతరులు – 136