Nagpur MLC Election:ఆర్ఎస్ఎస్ హెడ్‭క్వార్టర్ పరిధిలో బీజేపీకి దారుణ ఎదురు దెబ్బ

జనవరి 30న మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. కాగా ఈ ఫలితాలు శుక్రవారం విడులవుతున్నాయి. నాగ్‭పూర్‭ డివిజన్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తి ఫలితాలు మద్యాహ్నం నాటికే వచ్చాయి. కాగా 34,360 ఓట్లు పోలైన ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి నాగో గనార్‭కు 8,211 ఓట్లు రాగా

Nagpur MLC Election: నాగ్‭పూర్‭లో భారతీయ జనతా పార్టీకి దారుణ ఎదురుదెబ్బ తగిలింది. నాగ్‭పూర్‭ డివిజన్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఈ స్థానం నుంచి మహా వికాస్ అఘాడీ అభ్యర్థి విజయం సాధించారు. కేంద్రంలో కీలక మంత్రి అయిన నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్‭పూర్‭కు చెందిన వారే. అంతే కాకుండా బీజేపీకి మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాయం ఇక్కడే ఉంది. దీంతో బీజేపీకి అత్యంత బలమైన స్థానంగా ఉన్న ఈ ప్రాంతంలో తమ అభ్యర్థి ఓటమి పాలవ్వడం కాషాయ పార్టీని కలవరానికి గురి చేస్తోంది.

Fire In Telangana New Secretariat : కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం.. సీఎం కేసీఆర్ సీరియస్

జనవరి 30న మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. కాగా ఈ ఫలితాలు శుక్రవారం విడులవుతున్నాయి. నాగ్‭పూర్‭ డివిజన్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తి ఫలితాలు మద్యాహ్నం నాటికే వచ్చాయి. కాగా 34,360 ఓట్లు పోలైన ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి నాగో గనార్‭కు 8,211 ఓట్లు రాగా, మహా వికాస్ అఘాడీ అభ్యర్థి (కాంగ్రెస్) సుధాకర్ అద్బాలేకు 16,700 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థిపై ఎంవీఏ అభ్యర్థి డబుల్ మెజారిటీతో గెలుపొందారు.

ట్రెండింగ్ వార్తలు