Bypoll Results: ఏడు చోట్ల ఉప ఎన్నికలు.. ఎక్కడెక్కడ ఏ పార్టీ గెలిచిందంటే..?

ఛత్తీస్‭గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. ఛత్తీస్‭గఢ్‭లోని భానుప్రతాప్‭పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బ్రహ్మానంద్ నేతపై కాంగ్రెస్ అభ్యర్థి సావిత్రి మనోజ్ మందావి 21 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక రాజస్తాన్‭లోని సర్దార్షహర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అశోక్ కుమార్‭పై కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ శర్మ 27 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Bypoll Results: ఏడు చోట్ల ఉప ఎన్నికలు.. ఎక్కడెక్కడ ఏ పార్టీ గెలిచిందంటే..?

Bypoll Results: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏడు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా గురువారం విడుదలయ్యాయి. ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు సహా ఒక లోక్‭సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో మూడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనివి కాగా, మిగిలనవి ఒడిశా, బిహార్, ఛత్తీస్‭గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లోనివి.

ఎక్కడెక్కడ ఏ పార్టీ గెలిచిందంటే..
ఉత్తరప్రదేశ్‭లో ఒక లోక్‭సభ, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నిక జరిగింది. మెయిన్‭పురి లోక్‭సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్‭వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ విజయం సాధించారు. సుమారు 2.9 లక్షల ఓట్ల మెజారిటీతో ఆమె భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘురాజ్ సింగ్ శాక్యపై విజయం సాధించారు.
ఇక కటౌలి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో రాష్ట్రీయ లోక్‭దళ్ అభ్యర్థి మదన్ భైయా విజయం సాధించారు. ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజకుమారిపై విజయం సాధించారు.
రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్‭వాదీ పార్టీ అభ్యర్థి మహ్మద్ అసిమ్ రాజాపై భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆకాశ్ సక్సేనా 34 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Gujarat Polls: నా రికార్డు బద్ధలవుతుందని ముందే చెప్పాను: గుజరాత్ ఎన్నికల ఫలితాలపై మోదీ

బిహార్‭లోని కురాని అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కేదార్ ప్రసాద్ గుప్త విజయం సాధించారు. జేడీయూ అభ్యర్థి మనోజ్ కు.సింగ్‭పై స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.
ఛత్తీస్‭గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. ఛత్తీస్‭గఢ్‭లోని భానుప్రతాప్‭పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బ్రహ్మానంద్ నేతపై కాంగ్రెస్ అభ్యర్థి సావిత్రి మనోజ్ మందావి 21 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక రాజస్తాన్‭లోని సర్దార్షహర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అశోక్ కుమార్‭పై కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ శర్మ 27 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఇక చివరగా ఒడిశాలోని పదంపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార పార్టీ బిజూ జనతా దళ్ సత్తా చాటింది. ఈ స్థానం నుంచి బర్ష సింగ్ బరిహా 42 వేల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి పర్దీప్ పురోహిత్‭ని ఓడించారు.

Gujarat Polls: గుజరాత్ ఎన్నికల్లో ఆప్ పాత్రేంటి? కాంగ్రెస్ ఓటమితో బీజేపీ-బీ టీం అంటారా?