Karnataka polls: ప్రజల్ని బిచ్చగాళ్లు అనుకుంటున్నారు.. కాంగ్రెస్ నేత నోట్లు చల్లడంపై సీఎం బొమ్మై

శివ కుమార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా కూడా ఉన్న సంగతి తెలిసిందే. సిద్ధరాయమ్యతో కలిసి ఆయన సీఎం పదవి కోసం పాటుపడుతున్నారు. కర్ణాటకకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ఇప్పటికే కాంగ్రెస్ 124 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది.

Karnataka polls: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీసహా ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే, ఎన్నికల ర్యాలీలో భాగంగా కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. బస్సుపై ప్రచారం నిర్వహిస్తూ, రూ.500 నోట్లను శివకుమార్ వెదజల్లాడు. డీకే చేసిన ఈ పనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ ప్రజలు బిచ్చగాళ్లని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నరంటూ ఆయన మండిపడ్డారు.

Jada Sravan Kumar: కోనసీమ అల్లర్ల కేసుల ఉపసంహరణ.. అంబేద్కర్ ను అవమానించడమే

కాంగ్రెస్ పార్టీ ‘ప్రజా ధ్వని యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా డీకే శివకుమార్ బస్సు యాత్ర చేపట్టారు. మండ్య జిల్లా, బెవినహల్లిలో మంగళవారం ఈ బస్సు యాత్ర సాగింది. ఈ యాత్రకు వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. బస్సుపై ఉన్న శివకుమార్ పై నుంచి రూ.500 నోట్లను అక్కడున్న వారిపైకి విసిరేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Karnataka polls: ఇవే చివరి ఎన్నికలు.. భారీ ప్రకటన చేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య

కాగా, ఈ ఘటనపై బొమ్మై స్పందిస్తూ ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగోలేదు. కాంగ్రెస్ పార్టీ మరో 100 సీట్లకు అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే మా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యేలు, నేతలకు డీకే శివకుమార్ ఫోన్ చేసి తమ ఆఫర్ ఇస్తున్నారు. వారి కోసమే ఖాళీ ఉంచినట్లు, కాంగ్రెస్ పార్టీలో చేరగానే టికెట్ ఇస్తామని చెబుతున్నారు. నిజంగా వాళ్లు బలవంతులైతే తమ పార్టీలోకి వస్తే సీట్లు ఇస్తామంటూ మా ఎమ్మెల్యేలను పిలిచి ఉండేవారు కాదు. నిరాశతో ఎమ్మెల్యేలందరినీ బహిరంగంగానే పిలుస్తున్నారు. వాళ్లకు ఇప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థే లేరు. తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. అందుకే ఎన్నికల ప్రచారంలో డబ్బులు చల్లుతున్నారు. కానీ కాంగ్రెస్ అనుకుంటున్నట్లు కన్నడ ప్రజలు బిచ్చగాళ్లు కాదు’’ అని అన్నారు.

Himanta Biswa Sarma: నాకే కనుక కోర్టు శిక్ష వేస్తే.. రాహుల్ కేసులో కాంగ్రెస్ తీరుపై సీఎం శర్మ ఫైర్

శివ కుమార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా కూడా ఉన్న సంగతి తెలిసిందే. సిద్ధరాయమ్యతో కలిసి ఆయన సీఎం పదవి కోసం పాటుపడుతున్నారు. కర్ణాటకకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ఇప్పటికే కాంగ్రెస్ 124 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీకి పోలింగ్ జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నేటి నుంచి కోడ్ అమల్లోకి రానుంది. కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 5,21, 73,579 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. వీరిలో కొత్తగా 9.17లక్షల మంది ఓటర్లు చేరారు. 100 ఏళ్లుపైబడిన ఓటర్లు 16వేలకుపైగా ఉన్నారు. తొలిసారిగా ఎన్నికల సంఘం 80ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్నికల్పించింది.

ట్రెండింగ్ వార్తలు