MCD Polls: కాంగ్రెస్ మరీ ఇంతలానా? ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పత్తాలేని హస్తం పార్టీ

250 వార్డులు ఉన్న ఢిల్లీ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఏకంగా 134 వార్డుల్లో విజయం సాధించించి ఢిల్లీ మున్సిపల్ కోటపై మొదటిసారి చీపురు జెండా ఎగరవేసింది. అలాగే 15 ఏళ్లుగా నిరాటకంగా పాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి చెక్ పెట్టింది

MCD Polls: దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. దేశంతో పాటు దేశ రాజధానిని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో పడిపోవడంతో ఇదే మొదటిసారి. ఆమ్ ఆద్మీ పార్టీ ఆగమనానికి ముందు ఢిల్లీలో హస్తం పార్టీనే చక్రం తిప్పింది. కొద్ది రోజుల క్రితం మరణించిన ఆ పార్టీ నేత షీలా దీక్షిత్, ఢిల్లీని 15 ఏళ్లకు పైగా ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు. ఢిల్లీలో అధికారంలో కోల్పోయి పదేళ్లు కూడా కాలేదు. అంతలోనే కంటికి కనిపించనంతగా కాంగ్రెస్ పార్టీ కుంచించుకుపోయింది.

Singles in Korea: పెళ్లొద్దు మొర్రో అంటున్న కొరియన్ యువత.. కోటికి చేరువలో సింగిల్ పసంగులు

250 వార్డులు ఉన్న ఢిల్లీ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఏకంగా 134 వార్డుల్లో విజయం సాధించించి ఢిల్లీ మున్సిపల్ కోటపై మొదటిసారి చీపురు జెండా ఎగరవేసింది. అలాగే 15 ఏళ్లుగా నిరాటకంగా పాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి చెక్ పెట్టింది. తాజా ఫలితాల్లో బీజేపీ 103 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితైతే చాలా దారుణంగా తయారైంది. ఆ పార్టీ కేవలం 9 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.

MCD Polls: రాజ్యాన్ని గెలిచి రాజధానిలో నెగ్గని బీజేపీ.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమితో ఢిల్లీపై మరింత పట్టు సడలింది

వాస్తవానికి గత మున్సిపల్ ఎన్నికలతో పోల్చుకుంటే ఇదంత పెద్ద ఓటమేమీ కాకపోయినప్పటికీ.. కాకపోతే మరిన్ని స్థానాలు దిగజారటం కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా మరింత దెబ్బతీసింది. 2017లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 27 స్థానాలు గెలిచింది. ఈసారి ఎన్నికల్లో అందులో సగం స్థానాలను కూడా గెలవలేక చతికిలపడిపోయింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కనుచూపు మేరలో కూడా లేకుండా కనుమరుగైన కాంగ్రెస్ పార్టీకి, మున్సిపల్ ఎన్నికలు కాస్త మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డట్టైంది.

ట్రెండింగ్ వార్తలు