Assembly Elections Results: గత ఎన్నికలో సీట్లు.. ఈ ఎన్నికలో ఓట్లు కూడా కోల్పోయిన కమ్యూనిస్ట్ పార్టీ

Assembly Elections Results: గత ఎన్నికలో సీట్లు.. ఈ ఎన్నికలో ఓట్లు కూడా కోల్పోయిన కమ్యూనిస్ట్ పార్టీ

CPM loses highly again in Tripura, this time votes also

Assembly Elections Results: రెండు దశాబ్దాలకు పైగా త్రిపురను ఏకచత్రాధిపత్యంగా పాలించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (సీపీఎం) గత కొంత కాలంగా ప్రజాధారణ బాగా కోల్పోయింది. 2018లో అధికారం కోల్పోయిన సీపీఎం.. ఆ ఎన్నికల్లో 16 సీట్లే గెలిచినప్పటికీ 42.22 శాతం ఓట్లు సాధించింది. అయితే ఈసారి ఎన్నికల్లో సీట్లతో పాటు ఓట్లు కూడా కోల్పోయింది. తాజాగా విడుదలైన ఫలితాల్లో లెఫ్ట్ పార్టీకి దక్కిన ఓట్లు కేవలం 24.5 శాతమే. ఈ ఎన్నికల్లో సింగిట్ డిజిట్‭ను అతి కష్టం మీద ఆ పార్టీ దాటింది. కాంగ్రెస్‭తో పొత్తు పెట్టుకుని పోటీ చేసినప్పటికీ 11 స్థానాలకు మించి ప్రభావం చూపించలేకపోయింది.

Assembly Elections Results: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అంతిమ ఫలితాలు ఇవే..

గత ఎన్నికల్లో కూడా సీపీఎం 16 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అనేక స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు. మరో లెఫ్ట్ పార్టీ అయిన సీపీఐ అయితే కనీసం ఒక్క శాతం ఓట్లు కూడా సాధించలేదు. ఆ పార్టీకి 0.48 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. పొరుగు రాష్ట్రం పశ్చిమ బెంగాల్‭లో ఎలా అయితే పార్టీ పతనం అయిందో, త్రిపురలో కూడా అలాగే పతనం అవుతోంది. అయితే బెంగాల్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన పదేళ్లకే ఒక్క సీటు గెలవకపోగా 4 శాతం ఓటు బ్యాంకుకే పరిమితమైన సీపీఎం.. త్రిపురలో కాస్త మెరుగే అనిపించుకుంది. రెండో మజిలీ ఎన్నికల్లో 22 శాతం ఓటు బ్యాంకుతో పాటు 11 సీట్లను నిలబెట్టుకుంది.