Vice Presidential Election: కొనసాగుతున్న పోలింగ్.. అవకాశాలన్నీ బెంగాల్ మాజీ గవర్నర్‭కే‭!

జగ్‭దీప్ ధన్‭కర్‭కు 527 ఓట్లు రానున్నాయట. వాస్తవానికి ఈ ఎన్నికలో 372 ఓట్లు గెలుపు ఖాయం అవుతుంది. ఒక్క భారతీయ జనతా పార్టీ ఓట్లను పోగేసినా ఎన్డీయే అభ్యర్థి గెలుస్తారు. కానీ ఎన్డీయే పక్షాలతో పాటు వైసీనీ, బీజేడీ లాంటి ఎన్డీయేతర పక్షాలు కూడా జగ్‭దీప్‭కు మద్దతు ఇచ్చారు. ఈ ఎన్నికకు లోక్‭సభ నుంచి 543, రాజ్యసభ నుంచి 245 మొత్తంగా 780 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అయితే ఎనిమిది స్థానాలు ఖాళీగా ఉండగా.. టీఎంసీ ఈ ఎన్నికలో పాల్గొనబోమని ప్రకటించడంతో ప్రస్తుతం 744 ఓట్లు ఉన్నాయి.

Vice Presidential Election: కొనసాగుతున్న పోలింగ్.. అవకాశాలన్నీ బెంగాల్ మాజీ గవర్నర్‭కే‭!

Experts says Jagdeep Dhankhar Frontrunner in Vice Presidential Election

Vice Presidential Election: ఉపరాష్ట్రపతి ఎన్నిక శనివారం ప్రారంభమై కొనసాగుతోంది. కాగా, భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎన్డయే అభ్యర్థి జగ్‭దీప్ ధన్‭కర్‭ అధిక మెజారిటీతో గెలవనున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విపక్షల అభ్యర్థి మార్గరెట్ అల్వా అతి తక్కువ ఓట్లతో ద్వితియ స్థానానికి పరిమితం కానున్నారట. పార్లమెంట్ హౌజ్‭లో జరుగుతున్న ఈ పోలింగ్ సాయంత్రం 5 వరకు కొనసాగుతుంది. అనంతరమే ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇక విశ్లేషకులు చేస్తున్న అంచనాల ప్రకారం.. జగ్‭దీప్ ధన్‭కర్‭కు 527 ఓట్లు రానున్నాయట. వాస్తవానికి ఈ ఎన్నికలో 372 ఓట్లు గెలుపు ఖాయం అవుతుంది. ఒక్క భారతీయ జనతా పార్టీ ఓట్లను పోగేసినా ఎన్డీయే అభ్యర్థి గెలుస్తారు. కానీ ఎన్డీయే పక్షాలతో పాటు వైసీనీ, బీజేడీ లాంటి ఎన్డీయేతర పక్షాలు కూడా జగ్‭దీప్‭కు మద్దతు ఇచ్చారు. ఈ ఎన్నికకు లోక్‭సభ నుంచి 543, రాజ్యసభ నుంచి 245 మొత్తంగా 780 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అయితే ఎనిమిది స్థానాలు ఖాళీగా ఉండగా.. టీఎంసీ ఈ ఎన్నికలో పాల్గొనబోమని ప్రకటించడంతో ప్రస్తుతం 744 ఓట్లు ఉన్నాయి.

విశ్లేషకులు అంచనా ప్రకారం.. జగ్‭దీప్‭కు 527 ఓట్లు వస్తే.. 70 శాతం ఓట్లు ఆయన ఖాతాలో పడ్డట్టే. గతంలో వెంకయ్యనాయుడు సాధించిన ఓట్ల కంటే ఇది రెండు శాతం ఎక్కువ. బీజేపీకి స్వతంత్రంగా 394 ఓట్లు ఉన్నాయి. మొత్తంగా ఎన్డీయేకు 441 ఓట్లు ఉన్నాయి. నామినేట్ అయిన ఐదుగురు సభ్యులు కూడా ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేయనున్నారు. ఇక విపక్షాల అభ్యర్థి అల్వాకు మొత్తంగా 200 ఓట్లు రానున్నట్లు అంచనాలు వస్తున్నాయి. ఆమెకు కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, ఎస్పీలు మద్దతు ఇస్తున్నాయి. ఇవే కాక ఆప్, టీఆర్ఎస్, జేఎంఎం, శివసేనల నుంచి కూడా మద్దతు ఉంది.

BJP Leader Ttarun Chugh :బీజేపీలోకి చేరికల లిస్ట్ చాలాఉంది..ఇది ట్రైలర్ మాత్రమే..సినిమా ముందుంది..