Gujarat Polls: 20 ఏళ్ల అనంతరం మొదటిసారి క్రిస్టియన్‭కు టికెట్ ఇచ్చిన బీజేపీ

తాపి జిల్లాలో ఉన్న ఈ వ్యారా నియోజకవర్గం నుంచే మోహన్ బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో గిరిజన ప్రాభల్యం ఎక్కువ. అందునా క్రైస్తవ ఓట్ మరీ ఎక్కువ. గుజరాత్‭ను ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న బీజేపీకి వ్యారా లాంటి కొన్ని నియోజకవర్గాలు చిక్కడం లేదు. అందుకే తమ స్ట్రాటజీని మార్చుకుని క్రైస్తవ అభ్యర్థిని బరిలోకి దింపింది.

Gujarat Polls: 20 ఏళ్ల అనంతరం మొదటిసారి క్రిస్టియన్‭కు టికెట్ ఇచ్చిన బీజేపీ

Gujarat Polls: భారతీయ జనతా పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందూ మినహా మిగిలిన మతాలకు చాలా దూరంగా ఉండే పార్టీ. ఇక ఎన్నికలు వచ్చాయంటే కేవలం హిందువులకు మాత్రమే టికెట్లు ఇస్తామని ప్రకటిస్తుంది. ప్రకటించడమే కాదు ఇస్తుంది. ఇతర మతస్తులకు చాలా తక్కువ సందర్భాల్లో టికెట్లు ఇస్తుంటారు. అందునా ఇస్లాం, క్రైస్తవ మతాలకు చెందిన వారిని మరీ దూరంగా పెడుతుంటారు. బీజేపీ ఆది నుంచి బలంగా ఉన్న గుజరాత్ రాష్ట్రం గురించి వేరే చెప్పనక్కర్లేదు.

కేవలం హిందువులను మాత్రమే బరిలోకి దింపుతూ వస్తున్న ఆ పార్టీ మొదటిసారి ఒక క్రైస్తవ అభ్యర్థిని బరిలోకి దింపింది. గతంలో లేరని కాదు కానీ, దాదాపు 20 ఏళ్లుగా క్రైస్తవులకు టికెట్ ఇవ్వలేదు. అలాంటిది 20 ఏళ్ల అనంతరం మొదటిసారి ఒక క్రైస్తవ వ్యక్తిని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దింపింది బీజేపీ. ఆ అభ్యర్థి పేరు మోహన్ కొంకణి (48). వ్యారా నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ నేత పునాజీ గమిత్‭పై మోహన్ పోటీ చేయబోతున్నారు.

తాపి జిల్లాలో ఉన్న ఈ వ్యారా నియోజకవర్గం నుంచే మోహన్ బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో గిరిజన ప్రాభల్యం ఎక్కువ. అందునా క్రైస్తవ ఓట్ మరీ ఎక్కువ. గుజరాత్‭ను ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న బీజేపీకి వ్యారా లాంటి కొన్ని నియోజకవర్గాలు చిక్కడం లేదు. అందుకే తమ స్ట్రాటజీని మార్చుకుని క్రైస్తవ అభ్యర్థిని బరిలోకి దింపింది. మొత్తం 2.23 లక్షల ఓటర్లు ఉన్న వ్యారాలో 45 శాతం క్రైస్తవులే ఉంటారు. ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టున్న నియోజకవర్గం. ఎలాగైనా అక్కడ కాషాయ జెండా పాతాలని మోహన్‭ను బీజేపీ ఎంపిక చేసింది.

Bharat Jodo Yatra: ఘోర తప్పిదం.. భారత జాతీయ గీతానికి బదులు నేపాల్ జాతీయ గీతం ప్లే చేసిన కాంగ్రెస్