Karnataka Polls: కర్ణాటక ఎన్నికల్లో డబ్బే డబ్బు.. జస్ట్ అధికారులు పట్టుకున్నదే రూ.378 కోట్లు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 10వ తేదీన జరుగుతుంది. 13వ తేదీన ఓట్లు లెక్కించి ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.

Karnataka Polls: కర్ణాటక ఎన్నికల్లో డబ్బే డబ్బు.. జస్ట్ అధికారులు పట్టుకున్నదే రూ.378 కోట్లు

Karnataka Polls: మన దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా డబ్బు ప్రవాహం కట్టలు తెంచుకుని ప్రవహిస్తుంది. ఎన్నికల సంఘం, ఇతర ప్రభుత్వ సంస్థలు చేసే ప్రయత్నాలేవీ దీన్ని ఆపలేకపోతోంది. గ్రామ స్థాయి ఎన్నికల్లోనే లక్షల డబ్బు చేతులు మారడం సర్వసాధారణమైంది. రేపు (బుధవారం) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగే కర్ణాటకలో ధన ప్రవాహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలోనే అత్యంత ఆసక్తి కలిగిన రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు కూడా అంతే ప్రభావవంతంగా వెదజల్లుతున్నారు.

Nepal: మాట్లాడనివ్వడం లేదని పార్లమెంటులోనే బట్టలు విప్పేసిన ఎంపీ

ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియామవళిని అతిక్రమించి పంచుతున్న డబ్బులో 378 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇది గత ఎన్నికలతో (2018 నాటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు) పోల్చుకుంటే 4.5 రెట్లు ఎక్కువనట. ఇక వీటితో పాటు 288 కోట్ల రూపాయల ఆస్తులను సైతం ఈడీ సీజ్ చేసింది. అయితే ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుందే ఈ స్థాయిలో ఉంటే.. కళ్లు గప్పి చేతులు మారుతున్న సొమ్ము ఇంకెన్ని వేల కోట్లు ఉంటుందోనని విమర్శకులు అంటున్నారు.

Imran Khan Arrest : పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌.. 80కి పైగా కేసులు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 10వ తేదీన జరుగుతుంది. 13వ తేదీన ఓట్లు లెక్కించి ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో 5,21,73,579 మంది ఓటు వేసేందుకు అర్హులు ఉన్నారు. ఇందులో 2.62 కోట్ల మంది పురుషులు కాగా, 2.59 కోట్ల మంది మహిళలు. రాష్ట్రవ్యాప్తంగా 58,282 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది.