Madhya Pradesh Polls: ఆ ఇద్దరు నేతలు చేరడంతో కింగ్‭మేకర్‭గా మారనున్న బీఎస్పీ

దండోరియా గతంలో బీఎస్పీలోనే ఉన్నారు. ఆయన గతంలో బీఎస్పీ నుంచి లోక్‭సభకు పోటీ చేశారు. ఇక 2013 అసెంబ్లీ ఎన్నికల్లో దిమ్మి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ టీకెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కొంత కాలానికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తన మనసు మాత్రం ఎప్పుడూ బీఎస్పీ గురించే ఆలోచిస్తుందని ఆయన అన్నారు

Madhya Pradesh Polls: ఆ ఇద్దరు నేతలు చేరడంతో కింగ్‭మేకర్‭గా మారనున్న బీఎస్పీ

key leaders from bjp and congress joins bsp in madhyapradesh

Madhya Pradesh Polls: మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార భారతీయ జనతా పార్టీతో పాటు, విపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు వందలాది మంది అనుచరులతో కలిసి బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ కింగ్‭మేకర్‭గా మారనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మధ్యప్రదేశ్-బీజేపీ రాష్ట్ర ఎక్జిక్యూటివ్ మెంబర్ ఆవదేశ్ ప్రతాప్ సింగ్ సహా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బల్వీర్ సింగ్ దండోరియా సోమవారం బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు.

MLC Election Results 2023 : పవన్ కళ్యాణ్ మాట నిజమైంది.. ఈ ఎన్నికలు శుభపరిణామం.. గంటా శ్రీనివాసరావు

మధ్యప్రదేశ్-బీఎస్పీ అధ్యక్షుడు రమాకాంత్ పిప్పాల్ ఇరువురు నేతలకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ మెమెంటోలు ఇచ్చి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిక అనంతరం, దండోరియా మాట్లాడుతూ.. తొందరలోనే జర్నలిస్టులు, 5000 మంది యువత బీఎస్పీలో చేరతారని ప్రకటించారు. తాను చిన్నతనం నుంచి బీఎస్పీతో ఉన్నానని, అదే తనను ఈ పార్టీలోకి మళ్లీ తీసుకువచ్చిందని అన్నారు. ఇక ప్రజల అభిలాష మేరకే తాను బీఎస్పీలో చేరానని ప్రతాప్ సింగ్ అన్నారు.

MLC Election Results 2023: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా..‘జైలు నుండి వచ్చిన సైకోల పాలనకు చరమగీతం’ అంటూ అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు

దండోరియా గతంలో బీఎస్పీలోనే ఉన్నారు. ఆయన గతంలో బీఎస్పీ నుంచి లోక్‭సభకు పోటీ చేశారు. ఇక 2013 అసెంబ్లీ ఎన్నికల్లో దిమ్మి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ టీకెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కొంత కాలానికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తన మనసు మాత్రం ఎప్పుడూ బీఎస్పీ గురించే ఆలోచిస్తుందని ఆయన అన్నారు. ప్రతాప్ సింగ్‭ను తాజాగా బీజేపీ నుంచి తొలగించారు. దీంతో ఆయన బీఎస్పీలో చేరారు. వాస్తవానికి ఈ ఇరువురు నేతలో వేరే పార్టీలో ఉన్నప్పటికీ.. ఇద్దరూ బంధువులే. వీరితో పాటు రేవాలోని సిర్మౌర్‌కు చెందిన బీజేపీకి చెందిన నారాయణ్ మిశ్రా, సిద్ధి బీజేపీ నాయకురాలు రాణి వర్మ వందలాది మంది మద్దతుదారులను కలుపుకుని బీఎస్పీలో చేరారు. ఎప్పుడూ లేనంత, ఎవరూ ఊహించని రీతిలో చేరికలు పెరగడంతో ఈ ఎన్నికల్లో బీఎస్పీనే కింగ్‭మేకర్‭ అని అంటున్నారు.