Karnataka Election Results: ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది.. ఖర్గే కుమారుడు

భారతీయ జనతా పార్టీ కోస్తా కర్ణాటక, బెంగళూరు మినహా మరెక్కడా ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా గ్రామీణ కర్ణాటకలో అయితే ఆ పార్టీ ఎక్కడో ఒక చోట కానీ కనిపించలేదు. బెంగళూరులో పట్టున్న బీజేపీ.. అక్కడి కొంత ప్రభావం చూపగలిగింది

Karnataka Election Results: ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది.. ఖర్గే కుమారుడు

Karnataka Congress: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే పార్టీ తరపున ముఖ్యమంత్రిని అభ్యర్థిని ఎన్నికలకు ముందు ప్రకటించలేదు. పార్టీ విజయం ఖరారు కావడంతో ముఖ్యమంత్రి అభ్యర్థిపై అనేక అంచనాలు వస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే అన్నారు. ప్రియాంక్ ఈ ఎన్నికల్లో చిత్తాపూర్ నుంచి విజయం సాధించారు. ఇది ఆయనకు వరుసగా మూడో విజయం. తనను మూడుసార్లు ఎన్నుకున్న చిత్తాపూర్ ప్రజలకు ప్రియాంక్ ధన్యావాదాలు తెలిపారు.

కోస్తా, బెంగళూరు ప్రాంతాల్లోనే బీజేపీ.. మిగతా కర్ణాటకంతా కాంగ్రెసే
భారతీయ జనతా పార్టీ కోస్తా కర్ణాటక, బెంగళూరు మినహా మరెక్కడా ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా గ్రామీణ కర్ణాటకలో అయితే ఆ పార్టీ ఎక్కడో ఒక చోట కానీ కనిపించలేదు. బెంగళూరులో పట్టున్న బీజేపీ.. అక్కడి కొంత ప్రభావం చూపగలిగింది. ఈ రెండు ప్రాంతాలు మినహా కర్ణాటక అంతా కాంగ్రెస్ హవానే కొనసాగింది. జేడీఎస్ పార్టీకి పట్టున్న మైసూరులో కూడా కాంగ్రెస్ విజృంభించింది.