Mallikarjun Kharge: 100 మంది మోదీలు, అమిత్ షాలు వచ్చినా ఇక కాంగ్రెస్‭ గెలుపును ఆపలేరట

స్వతంత్ర్యం కోసం దేశ ప్రజలు ప్రాణాలు అర్పించారు. కాంగ్రెస్ వాళ్లు అనేక త్యాగాలు చేశారు. బీజేపీ అసలేమీ చేయలేదు. స్వాతంత్ర్యం కోసం బీజేపీ నుంచి ఒక్కరైనా ఉరికంబం ఎక్కారా? కనీసం స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్నారా? జైళ్లకు వెళ్లారా? దీనికి బదులు వాళ్లేం చేశారు? జాతి పిత మహాత్మాగాంధీని పొట్టనపెట్టుకున్నారు

Mallikarjun Kharge: 100 మంది మోదీలు, అమిత్ షాలు వచ్చినా ఇక కాంగ్రెస్‭ గెలుపును ఆపలేరట

Let 100 Modis and Shahs can't stop our victory in 2024 says Kharge

Mallikarjun Kharge: 9 ఏళ్లుగా తీవ్ర ఒడిదుడుకుల మధ్య బండి లాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ, రాబోయే సార్వత్రి ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలుస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే కాదు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి వారు వంద మంది వచ్చినా తమ విజయాన్ని ఆపలేరని ఛాలెంజ్ విసిరారు. అయితే భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ ఒంటరి పోరు చేయడం లేదని, ఇందుకోసం భావసారూప్యత కలిగిన పార్టీన్నింటిని కలుపుకుపోయే ప్రయత్నంలో ఉందని ఆయన స్పష్టం చేశారు.

YS Sharmila: నా మాటలపై హిజ్రాలు బాధపడితే క్షమాపణ కోరుతున్నా.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనపై గవర్నర్‌ను కలుస్తా..

ఈ విషయమై అలాంటి పార్టీలతో చర్చలు చేస్తున్నామని, గత 137 ఏళ్ల నుంచి (పార్టీ ఏర్పడిన నాటి నుంచి) ఇలాంటి చర్చలు సాగుతూనే ఉన్నాయని ఖర్గే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఉండవని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపడమే లక్ష్యమని అన్నారు. విపక్ష కూటమికి కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి ఇప్పటికే కాంగ్రెస్ నేతృత్వంలో యూనైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ఉంది. అయితే మల్లికార్జున మాటల్ని చూస్తుంటే, యూపీఏను మరింత విస్తృతం చేయడమో లేదంటే మరో కొత్త కూటమి ఏర్పాటు చేయడంలాగో కనిపిస్తోంది.

BRS AP President Chandrasekhar: ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం.. ఏపీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్థితి ..

నాగాలాండ్‌లో జరిగిన ఎన్నికల సభలో ఖర్గే మాట్లాడుతూ ”దేశాన్ని ఎదుర్కొనే ఏకైక వ్యక్తిని నేనే, ఇతర వ్యక్తులెవరూ నన్ను తాకలేరని ప్రధానమంత్రి మోదీ పదేపదే ఓమాట చెబుతున్నారు. ప్రజాస్వామ్యవాది ఎవరైనా అలా చెప్పుకుంటారా? మోదీజీ.. మీరేమీ నియంత కాదని గుర్తుంచుకోండి. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ ప్రజలే మీకు గుణపాఠం చెబుతారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రాదు. అన్ని పార్టీలను కలుపుకొని తాము మెజారిటీ సాధిస్తాు. 100 మంది మోదీలు, అమిత్‌షా వచ్చినా మా గెలుపును ఆపలేరు” అని అన్నారు. 2024లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ సారథ్యం వహిస్తుందని అన్నారు.

Manish Sisodia: మనీష్ సిసోడియాకు కేంద్ర హోం శాఖ షాక్.. మరో కేసులో సీబీఐ విచారణకు అనుమతిస్తూ ఆదేశాలు

ఇక బీజేపీ పదే పదే ప్రస్తావించే దేశభక్తిని స్వాతంత్ర్య పోరాటంతో ఉదహరిస్తూ ఖర్గే విరుచుకుపడ్డారు. ”స్వతంత్ర్యం కోసం దేశ ప్రజలు ప్రాణాలు అర్పించారు. కాంగ్రెస్ వాళ్లు అనేక త్యాగాలు చేశారు. బీజేపీ అసలేమీ చేయలేదు. స్వాతంత్ర్యం కోసం బీజేపీ నుంచి ఒక్కరైనా ఉరికంబం ఎక్కారా? కనీసం స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్నారా? జైళ్లకు వెళ్లారా? దీనికి బదులు వాళ్లేం చేశారు? జాతి పిత మహాత్మాగాంధీని పొట్టనపెట్టుకున్నారు. వీళ్లా దేశభక్తి గురించి చెప్పేది?” అని ఖర్గే నిప్పులు చెరిగారు. దేశ ఐక్యత కోసం ఇందిరాగాంధీ ప్రాణాలు కోల్పోయారని, రాజీవ్ గాంధీ ప్రాణాలర్పించారని, కానీ వాళ్లు (బీజేపీ) మాత్రం దేశానికి 2014లో స్వాతంత్ర్య వచ్చిందని చెబుతున్నారని, 1947 వాళ్లకు గుర్తులేదని ఎద్దేవా చేశారు.