Akali-BSP: లోక్‌సభ ఎన్నికల్లోనూ అకాలీ-బీఎస్పీ కలిసే పోటి.. మాయావతిని కలిసి పొత్తును పొడగించిన సుఖ్బీర్
శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్, బహుజన్ సమాజ్ పార్టీ అగ్రనాయకత్వం ఈరోజు ఢిల్లీలో పాత స్నేహాన్ని బలోపేతం చేయడం, రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సమన్వయం సాధించడం వంటి వాటి గురించి సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగింది. శిరోమణి, బీఎస్పీ కూటమిపై ప్రజలకు ఇప్పటికీ మంచి నమ్మకం ఉంది

Mayawati meets Badals, indicates alliance with Shiromani Akali Dal
Akali-BSP: 2024 లోక్‌సభ ఎన్నికల్లో అకాలీదళ్ పార్టీతో కలిసే పోటీకి దిగుతామని బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి ప్రకటించారు. గురువారం అకాలీ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్, ఆయన సతీమణి హర్ సిమ్రత్ కౌర్ కలిసి ఢిల్లీలోని మాయావతి నివాసానికి వచ్చి ఆమెతో సమావేశమయ్యారు. గతేడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆ పొత్తును కొనసాగించాలని ఇరు పార్టీలు నిర్ణయించినట్లు గురువారం ఉమ్మడి ప్రకటన వెలువడింది.
Andhra Pradesh Politics : జగన్ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం : మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఈ విషయమై గురువారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా మాయావతి స్పందిస్తూ ‘‘శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్, బహుజన్ సమాజ్ పార్టీ అగ్రనాయకత్వం ఈరోజు ఢిల్లీలో పాత స్నేహాన్ని బలోపేతం చేయడం, రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సమన్వయం సాధించడం వంటి వాటి గురించి సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగింది. శిరోమణి, బీఎస్పీ కూటమిపై ప్రజలకు ఇప్పటికీ మంచి నమ్మకం ఉంది. దానివైపు ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఆలోచిస్తారు. ఈ కూటమి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి దేశ రాజకీయాల్లో మార్పులకు నాంది పలుకుతుంది’’ అని వరుస ట్వీట్లు చేశారు.
Nagpur MLC Election:ఆర్ఎస్ఎస్ హెడ్‌క్వార్టర్ పరిధిలో బీజేపీకి దారుణ ఎదురు దెబ్బ
ఇక పంజాబ్ రాష్ట్రంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై మాయావతి మండిపడ్డారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆప్.. పంజాబీలను మోసం చేస్తున్నారని, వంచిస్తున్నారని దుయ్యబట్టారు. ఇరు పార్టీల ప్రభుత్వాలు తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజల నమ్మకాల్ని వమ్ము చేశారని విమర్శించారు. శిరోమణి అకాలీదళ్ వ్యవస్థాపకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన మరింత కాలం ఆరోగ్యంగా జీవించాలని మాయావతి ట్వీట్ చేశారు. శిరోమణి, బీఎస్పీ కూటమి ఏర్పాటు చేయడంతో పాటు, దాన్ని మరింత బలోపేతం చేయడంలో ప్రకాష్ సింగ్ బాదల్ సహకారం ప్రశంసనీయమని అన్నారు. ఈ కూటమికి ఆయన ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుందని మాయావతి అన్నారు.
Parliament Session: పార్లమెంటులో ‘అదానీ కల్లోలం’.. ఉభయసభలూ సోమవారానికి వాయిదా