Lok Sabha polls: దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచే పార్టీ ఏది?.. ఇండియా టుడే సర్వేలో వెల్లడి

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుందన్న విషయంపై ఇండియా టుడే-సీవోటర్ సర్వే నిర్వహించింది. ‘మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్’ పేరిట నిర్వహించిన ఈ సర్వేలో బీజేపీవైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. ప్రధాని మోదీ పాప్యులారిటీ ఇప్పటికీ తగ్గలేదు. సర్వేలో పాల్గొన్న వారిలో 72 శాతం మంది మోదీ పనితీరు పట్ల సానుకూలంగా ఉన్నారు. బీజేపీకి 284 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కి 191 సీట్లు వస్తాయని సర్వే ద్వారా తెలిసింది.

Lok Sabha polls: దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచే పార్టీ ఏది?.. ఇండియా టుడే సర్వేలో వెల్లడి

Lok Sabha polls

Lok Sabha polls: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుందన్న విషయంపై ఇండియా టుడే-సీవోటర్ సర్వే నిర్వహించింది. ‘మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్’ పేరిట నిర్వహించిన ఈ సర్వేలో బీజేపీవైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. ప్రధాని మోదీ పాప్యులారిటీ ఇప్పటికీ తగ్గలేదు. సర్వేలో పాల్గొన్న వారిలో 72 శాతం మంది మోదీ పనితీరు పట్ల సానుకూలంగా ఉన్నారు. బీజేపీకి 284 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కి 191 సీట్లు వస్తాయని సర్వే ద్వారా తెలిసింది.

ద్రవ్యోల్బణం పెరుగుదల, కరోనా వ్యాప్తి, చైనా నుంచి ముప్పు పొంచి ఉండడం వంటి ప్రతికూల అంశాల వేళ కూడా ప్రభుత్వ వ్యతిరేకతను మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు సమర్థంగా ఎదుర్కోగలదని తేలింది. ఈ సర్వేలో వివిధ వర్గాలకు చెందిన 1,40,917 మంది పాల్గొన్నారు.

ఈ నెల 67 శాతం మంది మోదీ పాలన పట్ల సానుకూలత వ్యక్తం చేశారని ఇండియా టుడే సర్వే ఫలితాల్లో పేర్కొంది. గత ఏడాది ఆగస్టుతో పోల్చితే ఇది 11 శాతం పెరిగిందని చెప్పింది. ఎన్డీఏ ప్రభుత్వ అతి పెద్ద వైఫల్యం ఏంటని సర్వేలో భాగంగా అడగగా ధరలు పెరగడం అని 25 శాతం మంది, నిరుద్యోగ సమస్యను అదుపు చేయలేకపోవడమని 17 శాతం మంది చెప్పారని పేర్కొంది.

అలాగే, కరోనాను నియంత్రించలేకపోవడం మోదీ ప్రభుత్వం అతి పెద్ద వైఫల్యమని ఎనిమిది శాతం మంది చెప్పారు. కాగా, 2014 నుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. ఎన్డీఏ నుంచి జేడీయూ వంటి పలు పార్టీలు వైదొలగినప్పటికీ బీజేపీకి ప్రస్తుతం పూర్తి మెజార్టీ ఉంది.

ISIS leader killed : ఐసిస్ సీనియర్ నాయకుడు బిలాల్ అల్ సుదానీని ముట్టుపెట్టిన అమెరికా సైన్యం