Smartphones to 1.35 crore women: వచ్చే ఏడాది ఎన్నికలు.. 1.35 కోట్ల మంది మహిళలకు స్మార్ట్ ఫోన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయం

రాజస్థాన్ లోని 1.35 కోట్ల మంది మహిళలకు స్మార్ట్ ఫోన్లు అందించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘ముఖ్యమంత్రి డిజిటల్ సేవా యోజన’ కింద ఈ స్మార్ట్ ఫోన్లను అందించనుంది. వచ్చే ఏడాది రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ లోగా ఈ పథకాన్ని అమలు చేయాలని రాజస్థాన్ ప్రభుత్వం భావిస్తోంది. రాజస్థాన్ ప్రభుత్వానికి 1.35 కోట్ల స్మార్ట్ ఫోన్లను అందించే ప్రాజెక్టును దక్కించుకోవడానికి మూడు టెలికాం కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.

Smartphones to 1.35 crore women: వచ్చే ఏడాది ఎన్నికలు.. 1.35 కోట్ల మంది మహిళలకు స్మార్ట్ ఫోన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయం

Smartphones to 1.35 crore women

Smartphones to 1.35 crore women: రాజస్థాన్ లోని 1.35 కోట్ల మంది మహిళలకు స్మార్ట్ ఫోన్లు అందించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘ముఖ్యమంత్రి డిజిటల్ సేవా యోజన’ కింద ఈ స్మార్ట్ ఫోన్లను అందించనుంది. వచ్చే ఏడాది రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ లోగా ఈ పథకాన్ని అమలు చేయాలని రాజస్థాన్ ప్రభుత్వం భావిస్తోంది. రాజస్థాన్ ప్రభుత్వానికి 1.35 కోట్ల స్మార్ట్ ఫోన్లను అందించే ప్రాజెక్టును దక్కించుకోవడానికి మూడు టెలికాం కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.

ఉన్నతస్థాయి కమిటీ బిడ్డర్లపై ఈ నెలలోనే నిర్ణయం తీసుకుంటుందని ఓ ఉన్నతాధికారి ఇవాళ మీడియాకు తెలిపారు. ఈ ప్రక్రియ అంతటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టును మొత్తం రూ.12,000 కోట్లతో చేపడుతున్నారు. ఈ ప్రభుత్వ ప్రాజెక్టుకు సంబంధించి టెక్నికల్ బిడ్ల దాఖలు ప్రక్రియను బుధవారం ప్రారంభించారు. ఉన్నతస్థాయి కమిటీ వాటిని పరిశీలిస్తోందని అధికారులు అన్నారు. పండుగల సీజన్ ప్రారంభానికి ముందే మొదటి దశలో స్మార్ట్ ఫోన్లను అందిస్తామని చెప్పారు. ‘చిరంజీవి ఆరోగ్య బీమా పథకం’ కింద పేర్లు నమోదు చేసుకున్న మహిళలకు స్మార్ట్ ఫోన్లతో పాటు మూడేళ్ళ పాటు ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా అందిస్తారు.

Janmashtami: లండన్‌లో భార్యతో కలిసి గుడికి వెళ్ళిన రిషి సునక్.. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నానని ట్వీట్