Maharashtra: ఉద్ధవ్‭పై నెగ్గిన షిండే.. నాలుగో స్థానానికి శివసేన

పుణే, సతారా, ఔరంగాబాద్‌, నాసిక్‌ పరిధిలోని 62 మండలాల్లో ఉన్న 271 గ్రామ పంచాయితీలకు ఓటింగ్‌ జరిగింది. ఈ ఓటింగ్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. కాగా ఇందులో బీజేపీ 82 స్థానాలు గెలుచుకుంది. ఎన్సీపీ 53 స్థానాలతో ద్వితియ స్థానంలో నిలిచింది. ఇక షిండే ఆధ్వర్యంలోని శివసేన 40 స్థానాలను గెలుచుకోగా ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన కేవలం 27 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ 22, ఇతరులు 47 చోట్ల విజయం సాధించారు.

Maharashtra: ఉద్ధవ్‭పై నెగ్గిన షిండే.. నాలుగో స్థానానికి శివసేన

Shinde group won more seats than shivsena in local body polls

Maharashtra: ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేనకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్రలోని గ్రామ పంచాయితీ ఎన్నికల్లో శివసేన కంటే షిండే వర్గం ఎక్కవు స్థానాలను గెలుచుకుంది. అన్యూహ్యంగా శివసేన నాలుగో స్థానానికి పరిమితమైంది. షిండే వర్గం గెలుచుకున్న స్థానాలకు పోల్చుకుంటే శివసేన గెలుచుకున్న స్థానాలకు మధ్య తేడా ఎక్కువగా ఉండడం మరో విశేషం. ఈ ఎన్నికల్లో మొదటి స్థానంలో బీజేపీ నిలిచింది. అనంతరం ఎన్సీపీ ఎక్కువ స్థానాల్ని కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ శివసేన వెనక్కు వెళ్లింది.

పుణే, సతారా, ఔరంగాబాద్‌, నాసిక్‌ పరిధిలోని 62 మండలాల్లో ఉన్న 271 గ్రామ పంచాయితీలకు ఓటింగ్‌ జరిగింది. ఈ ఓటింగ్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. కాగా ఇందులో బీజేపీ 82 స్థానాలు గెలుచుకుంది. ఎన్సీపీ 53 స్థానాలతో ద్వితియ స్థానంలో నిలిచింది. ఇక షిండే ఆధ్వర్యంలోని శివసేన 40 స్థానాలను గెలుచుకోగా ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన కేవలం 27 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ 22, ఇతరులు 47 చోట్ల విజయం సాధించారు.

షిండే వర్గంతో పాటు బీజేపీని ఎన్నికలకు వెళ్దామంటూ శివసేన నేతలు సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల ఫలితాలు శివసేనకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. శివసేనను చీల్చారని, కుట్ర పన్నారని ఆరోపిస్తున్న ఉద్ధవ్ వర్గానికి ఇది చెంప పెట్టని ఫలితాల అనంతరం షిండే వర్గం ఎద్దేవా చేసింది. బీజేపీ నేత ఒకరు స్పందిస్తూ ఇది ప్రజాతీర్పని, ప్రజావ్యతిరేక కూటమికి(మహా వికాస్‌ అగాఢిని ఉద్దేశించి) ప్రజలు ఇచ్చిన తిరస్కారమని అన్నారు. మున్ముందు ఇదే కొనసాగుతుందంటూ థాక్రే వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Modi and Chandrababu meet: చాలా రోజులకు కలుసుకున్న మోదీ, చంద్రబాబు.. కాసేపు ప్రత్యేకంగా మాటామంతీ