Sedition law: దేశద్రోహ చట్టంలో మార్పులు చేయనున్నట్లు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

జైలులో ఉన్న వారు బెయిలు కోసం కోర్టుకు వెళ్లవచ్చని తెలిపింది. ఇక ముందు కేసులు రిజిస్టర్ చేస్తే సంబంధింత పార్టీలు కోర్టును అశ్రయించవచ్చని, వాటిని కోర్టును సాధ్యమైనంత త్వరగా డిస్పోజ్ చేయాలని ధర్మాసనం పేర్కొంది. సెక్షన్ 124(ఏ)లోని నిబంధనలను పునఃపరిశీలించేందుకు కేంద్రానికి ధర్మాసనం అనుమతిస్తూ, రీ-ఎగ్జామినేషన్ పూర్తయ్యేంత వరకూ చట్టంలోని నిబంధనలను వర్తింపజేయడం సరికాదని స్పష్టం చేసింది.

Sedition law: దేశద్రోహ చట్టంలో మార్పులు చేయనున్నట్లు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

The central government has said that changes will be made in the Sedition Act

Sedition law: ఐపీసీలోని సెక్షన్ 124(ఏ) దేశద్రోహ చట్టం కేసులో మార్పులు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ మార్పులు తేవాలని అనుకుంటున్నట్టు సోమవారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేసింది. ఈ చట్టంపై రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేస్తోంది. వీటిలో కొన్ని పిటిషన్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. దీనిపై కేంద్రం తాజాగా వివరణ ఇవ్వడంతో తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి రెండో వారానికి భారత ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ వాయిదా వేశారు.

పోయిన ఏడాది మేలో సుప్రీంకోర్టు దీనిపై కేంద్రానికి ఆదేశాలిస్తూ, దేశద్రోహం చట్టంపై కేంద్రం సమీక్ష పూర్తయ్యేంత వరకు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. అప్పటివరకూ సెక్షన్ 124(ఏ) కింద కేసులు నమోదు చేయవద్దని ఇటీవల పదవీ విరమణ చేసిన సీజేఐ ఎన్వీ రమణ సారథ్యంలోని జస్టిస్ సూర్యకాంత్, హిమా కోహ్లితో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది.

జైలులో ఉన్న వారు బెయిలు కోసం కోర్టుకు వెళ్లవచ్చని తెలిపింది. ఇక ముందు కేసులు రిజిస్టర్ చేస్తే సంబంధింత పార్టీలు కోర్టును అశ్రయించవచ్చని, వాటిని కోర్టును సాధ్యమైనంత త్వరగా డిస్పోజ్ చేయాలని ధర్మాసనం పేర్కొంది. సెక్షన్ 124(ఏ)లోని నిబంధనలను పునఃపరిశీలించేందుకు కేంద్రానికి ధర్మాసనం అనుమతిస్తూ, రీ-ఎగ్జామినేషన్ పూర్తయ్యేంత వరకూ చట్టంలోని నిబంధనలను వర్తింపజేయడం సరికాదని స్పష్టం చేసింది.

Lula da Silva: అధ్యక్షుడి నుంచి కరప్షన్ ఖైదీ.. మళ్లీ అధ్యక్షుడిగా లులా డ సిల్వా