Assembly Elections Results: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అంతిమ ఫలితాలు ఇవే..

నాగాలాండ్ రాష్ట్ర గత ఎన్నికల్లో 26 స్థానాలు గెలిచిన అతిపెద్ద పార్టీగా అవతరించిన నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‭పీఎఫ్) ఈసారి కేవలం రెండు స్థానాలకే పరిమితం అయింది. అధికార పార్టీ ఎన్‭డీపీపీ గతంలో 18 స్థానాలు సాధించగా ఈసారి కాస్త పుంజుకుని 25 స్థానాల్ని కైవసం చేసుకుంది. ఇక మేఘాలయ రాష్ట్రంలో అధికార పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‭పీపీ) గత ఎన్నికల్లో 20 స్థానాలు గెలవగా, ఈసారి మరో 5 స్థానాలు ఎగబాకి 25 స్థానాలు గెలుచుకుంది

Assembly Elections Results: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అంతిమ ఫలితాలు ఇవే..

The final results of 3 states assembly elections

Assembly Elections Results: త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. త్రిపురలో భారతీయ జనతా పార్టీ 32 స్థానాలను గెలుచుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది. నాగాలాండ్‭లో ఎన్‭డీపీపీ-బీజేపీ కూటమి 37 స్థానాలు గెలుచుకుని (25+12) అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక మేఘాలయలో అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ 25 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ఆ రాష్ట్రంలో హంగ్ ఏర్పడింది. వాస్తవానికి గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీల విషయంలో పెద్ద మార్పేమీ కనిపించడం లేదు. కానీ కొన్ని కీలక పరిణామాలైతే కనిపించాయి. త్రిపురలో బీజేపీ, సీపీఎం పార్టీలు అటుఇటుగా అవే ఫలితాల్ని సాధించాయి. అయితే ఒక్క త్రిపా మోతా పార్టీ మొదటిసారి ఎన్నికల్లోకి దిగి 13 స్థానాలు గెలుచుకుంది.

Assembly Election Results 2023: నాగాలాండ్, త్రిపురలో దూసుకెళ్తున్న బీజేపీ.. Live Updates

ఇక నాగాలాండ్ రాష్ట్ర గత ఎన్నికల్లో 26 స్థానాలు గెలిచిన అతిపెద్ద పార్టీగా అవతరించిన నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‭పీఎఫ్) ఈసారి కేవలం రెండు స్థానాలకే పరిమితం అయింది. అధికార పార్టీ ఎన్‭డీపీపీ గతంలో 18 స్థానాలు సాధించగా ఈసారి కాస్త పుంజుకుని 25 స్థానాల్ని కైవసం చేసుకుంది. ఇక మేఘాలయ రాష్ట్రంలో అధికార పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‭పీపీ) గత ఎన్నికల్లో 20 స్థానాలు గెలవగా, ఈసారి మరో 5 స్థానాలు ఎగబాకి 25 స్థానాలు గెలుచుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ 21 స్తానాల నుంచి 5 స్థానాలకు పడిపోయింది.

త్రిపుర ఫలితాలు
బీజేపీ – 32
త్రిపా మోతా – 13
సీపీఎం – 11
కాంగ్రెస్ – 3
ఏపీఎఫ్‭టీ – 1

నాగాలాండ్ ఫలితాలు
ఎన్‭డీపీపీ – 25
బీజేపీ – 12
ఎన్‫‭సీపీ -7
ఎన్‭పీపీ – 5
స్వతంత్రులు – 4
ఎల్‭జేపీ (రాంవిలాస్) – 2
ఆర్‭పీఐ (అథవాలె) – 2
ఎన్‭పీఎఫ్ – 2
జేడీయూ – 1

మేఘాలయ ఫలితాలు
ఎన్‭పీపీ – 25
యూడీపీ – 11
కాంగ్రెస్ – 5
టీఎంసీ – 5
వీపీపీ – 4
బీజేపీ – 3
హెచ్ఎస్‭పీడీపీ – 2
పీడీఎఫ్ – 2
స్వతంత్రులు – 2