Meghalaya Polls: కమల వికాసం, సమాధి నిర్మాణం.. మేఘాలయ‭లో ముగిసిన మోదీ ఎన్నికల సభ

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత్వం ఉండేదని ప్రధాని అన్నారు. దిల్లీ నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఈశాన్య భారత్‌ను పాలించేవారని, ఢిల్లీ నుంచి షిల్లాంగ్ వరకు వారసత్వ రాజకీయాలకే ప్రాధాన్యత ఉండేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతం అభివృద్ధికి కేటాయించిన నిధులను కాంగ్రెస్‌ హయాంలో మళ్లించేవారని విమర్శించారు

Meghalaya Polls: కమల వికాసం, సమాధి నిర్మాణం.. మేఘాలయ‭లో ముగిసిన మోదీ ఎన్నికల సభ

The interests of Meghalaya were never given priority says modi

Meghalaya Polls: నాగాలాండ్ రాష్ట్రంలో కమలం వికసిస్తుందని ప్రజలు చెబుతుంటే, కాంగ్రెస్ మాత్రం తన సమాధి నిర్మాణం జరుగుతుందని నినాదాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. శుక్రవారం మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా షిల్లాంగ్‭లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచకుపడ్డారు.

CWC: కాంగ్రెస్ పార్టీ సర్వోన్నత విభాగానికి ఎన్నికలు లేవు, సభ్యుల్ని అధ్యక్షుడు ఖర్గేనే నియమిస్తారట

‘‘మీ ప్రజలను మీరు నమ్మకపోతే దేశాన్ని పాలించలేరు. వారి సమస్యలను గౌరవించి పరిష్కరించాలి. మొదట్లో ఈశాన్య భారతంలో వేర్పాటు రాజకీయాలు జరిగేవి. మేము వాటిని పాలన ఆధారంగా జరిగేలా నిర్ణయించాం. భాజపా మతం లేదా ప్రాంతం ఆధారంగా ప్రజలపై వివక్ష చూపదు’’ అని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి కోసం 1958 ఆర్మ్‌డు ఫోర్సెస్‌ చట్టాన్ని తొలగించిన విషయాన్ని మోదీ వెల్లడించారు. మేఘాలయలో అంతటా బీజేపీ ఉందన్న మోదీ.. ‘‘మోదీ, మీ కమలం వికసిస్తుంది’’ అని ప్రజలు చెబుతుంటే, ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీకి చెందినవారు మాత్రం ‘‘మోదీ, నీ సమాధి నిర్మాణం జరుగుతుంది’’ అని అంటున్నారని దుయ్యబట్టారు.

Missed Call: 11 ఏళ్ల బాలిక మర్డర్ కేసులో నిందితుల్ని పట్టించిన మిస్‭డ్ కాల్

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత్వం ఉండేదని ప్రధాని అన్నారు. దిల్లీ నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఈశాన్య భారత్‌ను పాలించేవారని, ఢిల్లీ నుంచి షిల్లాంగ్ వరకు వారసత్వ రాజకీయాలకే ప్రాధాన్యత ఉండేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతం అభివృద్ధికి కేటాయించిన నిధులను కాంగ్రెస్‌ హయాంలో మళ్లించేవారని విమర్శించారు. కానీ భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారు మాత్రం ఈ రాష్ట్రానికి శాంతి, పురోగతి, శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తోందని మోదీ వెల్లడించారు.