Tripura Assembly Polls: అగర్తలాలో ఓటు వేసిన ముఖ్యమంత్రి మాణిక్ సాహా

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో 13.55లక్షల మంది మహిళలతో సహా మొత్తం 28.13లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో 20 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ – ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ), సీపీఎం – కాంగ్రెస్ కూటములతో పాటు ప్రాంతీయ పార్టీ అయిన తిప్రా మోతా ప్రధాన పోటీదారులుగా బరిలో ఉన్నాయి. బీజేపీ 55 స్థానాల్లో పోటీ చేస్తుండగా..

Tripura Assembly Polls: అగర్తలాలో ఓటు వేసిన ముఖ్యమంత్రి మాణిక్ సాహా

Tripura CM Dr Manik Saha casts vote in Assembly elections, in Agartala

Tripura Assembly Polls: త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ.. సాయంత్రం 4గంటల వరకు జరుగుతుంది. ఇందుకోసం త్రిపుర వ్యాప్తంగా 3,337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 1100 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా, 28 పోలింగ్ కేంద్రాలు అతి సమస్యాత్మకంగా గుర్తించారు. ఆయా కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. పోలింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నిషేదాజ్ఞలు విధించారు. 17వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

Tech Tips : వాట్సాప్‌లో మెసేజ్ పంపినవారికి తెలియకుండా ఎలా చదవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ట్రిక్..!

కాగా, రాష్ట్ర అగర్తలాలో ముఖ్యమంత్రి మాణిక్ సాహా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే ఆయన ఓటు వేయడం గమనార్హం. త్రిపురలో ప్రతీసారి అత్యధిక ఓట్ శాతం నమోదు అవుతుంది. ఈసారి 90 శాతానికి మించి ఓటింగ్ నమోదు అవుతుందని అంటున్నారు. కాగా, 25 ఏళ్ల కమ్యూనిస్ట్ పాలనను కూల్చిన భారతీయ జనతా పార్టీ, వరుసగా రెండో సారి కాషాయ జెండాను ఎగరేసేందుకు ఉవ్విళ్లూరుతోంది.

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిన ప్రైవేట్ కాలేజీలు : బండి సంజయ్

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో 13.55లక్షల మంది మహిళలతో సహా మొత్తం 28.13లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో 20 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ – ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ), సీపీఎం – కాంగ్రెస్ కూటములతో పాటు ప్రాంతీయ పార్టీ అయిన తిప్రా మోతా ప్రధాన పోటీదారులుగా బరిలో ఉన్నాయి. బీజేపీ 55 స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని మిత్రపక్షం ఐపీఎఫ్టీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇందులో ఒక స్థానం స్నేహపూర్వక పోటీ ఉంటుంది. అదేవిధంగా సీపీఐ (ఎం) 47 స్థానాల్లో పోటీ చేయగా, దానికూటమి భాగస్వామ్య పక్షం కాంగ్రెస్ 13 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక తిప్రామోథ 42 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ 28 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపగా, 58 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.