Gujarat Polls: గుజరాత్ ఎన్నికల్లో ఓటింగ్ తగ్గుదలకు అదే అసలు కారణమట

సూరత్, రాజ్‭కోట్, జాంనగర్ ప్రాంతాల్లో అతి తక్కువ ఓటింగ్ నమోదు అయింది. మొదటి దశ పోలింగ్ ఈ ప్రాంతాల్లో జరిగింది. కేవలం 63.3 శాతం మాత్రమే ఓటింగ్ నమోదు అయింది’’ అని తెలిపింది. వాస్తవానికి 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో 66.75 శాతం పోలింగ్ నమోదు అయింది. ‘‘చాలా నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరిగింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పట్టణ ప్రాంతాల్లో చాలా తక్కువ ఓటింగ్ నమోదు అయింది.

Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా డిసెంబర్ 1న మొదటి దశ పోలింగ్ జరిగింది. అయితే పోలింగులో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అయింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే చాలా ఎక్కువ మొత్తంలో ఈ తగ్గుదల నమోదు అయింది. అయితే ఇందుకు ప్రధాన కారణం పట్టణాలే అని చెబుతోంది ఎన్నికల సంఘం. పట్టణాలు, నగరాల్లో ఉన్నవారు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదని, రోజు రోజుకూ ఈ అలవాటు పెద్దదై పోతుందని, అందుకే క్రమంగా ఓటింగ్ శాతం తగ్గుతోందని ఈసీ పేర్కొంది.

WhatsApp Chat Filter : వాట్సాప్‌ చాట్ లిస్టులో మీరు చూడని మెసేజ్‌లను ఈజీగా ఇలా ఫిల్టర్ చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

ఈ విషయమై ఎన్నికల సంఘం అధికారి ఒకరు స్పందిస్తూ ‘‘సూరత్, రాజ్‭కోట్, జాంనగర్ ప్రాంతాల్లో అతి తక్కువ ఓటింగ్ నమోదు అయింది. మొదటి దశ పోలింగ్ ఈ ప్రాంతాల్లో జరిగింది. కేవలం 63.3 శాతం మాత్రమే ఓటింగ్ నమోదు అయింది’’ అని తెలిపింది. వాస్తవానికి 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో 66.75 శాతం పోలింగ్ నమోదు అయింది. ‘‘చాలా నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరిగింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పట్టణ ప్రాంతాల్లో చాలా తక్కువ ఓటింగ్ నమోదు అయింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అదే కనిపించింది. పట్టణ ఓటర్లు పోలింగుకు దూరంగా ఉంటున్నారు’’ అని ఈసీ పేర్కొంది.

The Kashmir Files Row: ది కశ్మీర్ ఫైల్స్‭పై కామెంట్స్ ఎఫెక్ట్.. ఇజ్రాయెల్ రాయబారికి విధ్వేష సందేశాలు

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 75.6 శాతం పోలింగ్ నమోదు కాగా, రాజధాని షిమ్లాలో 62.53 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇలాంటి పరిస్థితే గుజరాత్ పట్టణాల్లో కూడా కనిపించిందట. రెండో దశ పోలింగులో కూడా ఇలాంటి పరిస్థితే కనిపించనుందని ఈసీ అభిప్రాయపడింది. రెండో దశ పోలింగులో భాగంగా 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. మొత్తం 800 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ట్రెండింగ్ వార్తలు