Gujarat Polls: గత ఎన్నికల్లో బీజేపీని గజగజలాడించిన కాంగ్రెస్ ఇప్పుడెందుకు కనుమరుగైంది? ఆ నేత లేకపోవడమే కాంగ్రెస్ ఓటమికి కారణమా?

గుజరాత్ బాధ్యతల్ని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‭కు అప్పగించారు. వాస్తవానికి ఆయన చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి అనేకంటే, సరైన ప్రయత్నాలే చేయలేదనడమే సమంజసం. పార్టీ అంత బలంగా ఉన్నప్పటికీ ఎన్నికల ప్రచారం సరిగా నిర్వహించలేకపోయారు. అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అధికార పార్టీ తప్పిదాల్ని చెప్పే ప్రయత్నంలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయింది.

Gujarat Polls: గత ఎన్నికల్లో బీజేపీని గజగజలాడించిన కాంగ్రెస్ ఇప్పుడెందుకు కనుమరుగైంది? ఆ నేత లేకపోవడమే కాంగ్రెస్ ఓటమికి కారణమా?

Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం విడుదలవుతున్నాయి. భారతీయ జనతా పార్టీకి ఏకపక్షంగా ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. దాదాపుగా గుజరాత్‭ను బీజేపీ క్లీన్ స్వీప్ చేసినట్లే కనిపిస్తోంది. విపక్ష కాంగ్రెస్ పార్టీ సమీపంలో కూడా కనిపించడం లేదు. ఏదో సింగిల్ డిజిట్ దాటిందంటే దాటిందన్నట్టు ఉంది పరిస్థితి. గత ఎన్నికల్లో బీజేపీని గజగజలాంచిన కాంగ్రెస్ పార్టీ, ఈసారెందుకు ఇంతలా పడిపోయిందనే ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. దీనికి చాలా మంది నుంచి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి.

Waltair Veerayya: ఫ్యామిలీతో విహార యాత్ర.. హీరోయిన్‌తో వీరయ్య యాత్ర.. అదిరిపోయిందిగా!

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రముఖ నాయకులు ఎవరూ పెద్దగా పాల్గొనలేదు. రాహుల్ గాంధీ ఏ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనకుండా భారత్ జోడో యాత్రలో బిజీ అయిపోయారు. వాస్తవానికి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ యాత్ర గుజరాత్ వైపుకు మళ్లితే చాలా మైలేజ్ ఉంటుందని అనుకున్నప్పటికీ, రాహుల్ అటువైపు కూడా చూడకుండా యాత్ర కొనసాగించడం గమనార్హం. ఇక సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సైతం గుజరాత్ వైపు కన్నెత్తి చూడలేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే సైతం హస్తినను వదిలి రాలేదు.

When the BJP putsch failed and Congress’ Ahmed Patel won

గుజరాత్ బాధ్యతల్ని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‭కు అప్పగించారు. వాస్తవానికి ఆయన చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి అనేకంటే, సరైన ప్రయత్నాలే చేయలేదనడమే సమంజసం. పార్టీ అంత బలంగా ఉన్నప్పటికీ ఎన్నికల ప్రచారం సరిగా నిర్వహించలేకపోయారు. అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అధికార పార్టీ తప్పిదాల్ని చెప్పే ప్రయత్నంలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే ఇవన్నీ కారణాలు ఒకవైపైతే.. అతి పెద్ద కారణం కాంగ్రెస్ పార్టీ మాజీ నేత అహ్మద్ పటేల్ లేకపోవడం అంటున్నారు.

Gujarat Election 2022: డిసెంబర్ 12న గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం..

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించినంత పని చేసింది కాంగ్రెస్. 1998 అనంతరం తొలిసారి బీజేపీని డబుల్ డిజిట్‭కు పరిమితం చేసిందంటే, కాంగ్రెస్ ఎంతలా పుంజుకుందో అర్థం చేసుకోవచ్చు. 41.44 శాతం ఓట్ బ్యాంకుతో 77 సీట్లు గెలుచుకుని బీజేపీకి ధీటుగా నిలబడింది. అయితే ఈసారి కేవలం 16 స్థానాల వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ అన్నీ దగ్గరుండి చూసుకుని పార్టీని ఎన్నికల్లో నిలబెట్టారట. మేనిఫెస్టో రూపకల్పన నుంచి అభ్యర్థుల ఎంపిక, ప్రచార నిర్వహణ అన్నీ తానై నడిపించారట. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన లోపాలివి. కొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారంలో కాస్త హడావిడిగా కనిపించింది కానీ, కాంగ్రెస్ మాత్రం అంతగా ప్రభావం చూపలేదు. అహ్మద్ పటేల్ లేని లోటు కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.