Assembly Election: ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న మూడు రాష్ట్రాల్లో ఏ పార్టీ బలమెంతంటే?

Assembly Election: ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న మూడు రాష్ట్రాల్లో ఏ పార్టీ బలమెంతంటే?

Which party is stronger in the three states where elections will be held in February?

Assembly Election: ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయి. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న విడుదలవుతాయి.

Governor RN Ravi: తమిళనాడు పేరు మార్పు వివాదంపై క్షమాపణలు చెప్పిన గవర్నర్

అయితే మిగిలిన భారతదేశంతో పోల్చుకుంటే ఈశాన్య రాష్ట్రాల్లో రాజకీయం కాస్త భిన్నంగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఈశాన్య రాష్ట్రాల్లోని మెజారిటీ స్థానాలు ఆ పార్టీకి వస్తాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఈశాన్యంపై ఎక్కువగా ఉండేది. కొంత కాలంగా బీజేపీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే అస్సాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలను ప్రత్యక్షంగా పాలిస్తున్న బీజేపీ.. మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో అధికార పార్టీతో పొత్తులో ఉంది. ఒక్క నాగాలాండ్ రాష్ట్రంలో బీజేపీ సహాయం లేకుండా ప్రభుత్వం నడుస్తోంది. అయితే అక్కడ కూడా అధికార పార్టీతో బీజేపీ దోస్తీ చేస్తోంది.

Karnataka: ఎన్నికలకు బీజేపీ పక్కా ప్లాన్.. నాలుగు దిక్కుల నుంచి రథయాత్రలు చేస్తారట

ఇక తాజాగా నోటిఫికేషన్ విడుదలైన మూడు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి మూడు రకాలుగా ఉంది. త్రిపురలో సంపూర్ణ అధికారం ఉండగా, మేఘాలయలో పొత్తులో ఉంది. ఇక నాగాలాండ్ రాష్ట్రంలో విపక్ష స్థానం ఉన్నప్పటికీ అధికార పార్టీతో స్నేహం చేస్తుండడం గమనార్హం. ఇక దేశంతో పాటు ఈశాన్య ప్రాంతాన్ని కూడా సుదీర్ఘంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మచ్చుకైనా కనిపించడం లేదు. ఒక్క త్రిపుర రాష్ట్రంలో మాత్రమే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. మిగిలిన రెండు రాష్ట్రాల అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదు.

Madhya Pradesh: పోలీసు అధికారిని చెప్పుతో కొట్టిన బీజేపీ నేత.. వీడియో వైరల్

త్రిపుర: 20 ఏళ్లు పాలించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) మరోసారి అధికారంలోకి రావడం అనుమానమే అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఉనికిని కాపాడుకుంటే చాలని అంటున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. ఈశాన్యంలో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా త్రిపుర స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగితే భంగపాటు ఎదురైంది. ఎటొచ్చీ అధికారంలో ఉన్న బీజేపీయే మళ్లీ గెలుస్తుందనే అంచనాలు చాలా కాలంగానే కొనసాగుతున్నాయి.

మేఘాలయ: మేఘాలయలో నాగా నేషనల్ ఫ్రంట్ కూటమి అధికారంలో ఉంది. నాగా ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రంలో మొదటి నుంచి జాతీయ పార్టీ ప్రభావం చాలా తక్కువ. చిన్ని రాష్ట్రమే అయినప్పటికీ స్థానిక పార్టీలు ఎక్కువ. వాటి ప్రభావం కూడా ఎక్కువే. అయితే ఈ రాష్ట్రంలో టీఎంసీ విపక్షంలో ఉంది. అధికార పక్షంతో బీజేపీ దోస్తీ చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా స్థానిక పార్టీలే గెలవొచ్చనే అంచనాలు వస్తున్నాయి.

నాగాలాండ్: గత ఎన్నికల్లో 26 స్థానాలు గెలిచిన నాగా పీపుల్ ఫ్రంట్ పార్టీ.. తన ఎమ్మెల్యేలను అధికార ఎన్డీపీపీకీ కోల్పోయింది. 22 మంది ఎమ్మెల్యేలు గట్టు దాటడంతో ఆ పార్టీకి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ వచ్చింది. ఇక ఈ రాష్ట్రంలో బీజేపీ 12 స్థానాలతో ఉంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఇంతకు రెండింతలు స్థానాల్ని గెలుచుకుంటే, అధికారం కమల పార్టీదేనని అంటున్నారు. ఇక స్థానిక పార్టీలు కూడా బలంగా ఉండడంతో త్రిముఖ పోటీ కూడా తప్పదనే విశ్లేషనలు కూడా వస్తున్నాయి.