Gujarat Polls: అన్ని బూతుల్లో మేమే గెలుస్తాం.. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

గుజరాత్‌లోని సౌరాష్ట్రలో అమ్రేలీ, బోటాడ్‌లలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ఆదివారం మాట్లాడనున్నారు. అంతకుముందు ఆయన సోమనాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వెరవల్ పట్టణంలో జరిగిన ప్రచార సభలో కూడా ఆయన మాట్లాడారు. ఆయన గుజరాత్ పర్యటన శనివారం ప్రారంభమైంది. గుజరాత్‌లో 182 శాసన సభ స్థానాలున్నాయి. డిసెంబరు 1, 5 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది, డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు, పలితాల వెల్లడి జరుగుతాయి.

Gujarat Polls: అన్ని బూతుల్లో మేమే గెలుస్తాం.. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

Gujarat Polls: వచ్చే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని బూతులను గెలుస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆదివారం రాష్ట్రంలోని రాజ్‌కోట్ జిల్లా ధోరాజీలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్ ప్రజలు తన గురువులని చెప్పారు. వారి ఆశీర్వాదాలు తనకు కావాలన్నారు. గుజరాత్ ప్రజలు, కచ్-కథియవాడ్ ప్రజలు తన గురువులని, వారు తనకు శిక్షణనిచ్చి, తనను అభివృద్ధి చేశారని చెప్పారు. అభివృద్ధి చెందిన, సౌభాగ్యవంతమైన రాష్ట్రంగా గుజరాత్‌ను తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యమని చెప్పారు.

రెండు దశాబ్దాలపాటు సమైక్యంగా కృషి చేసినందుకే ప్రజల ఆశీర్వాదాలను బీజేపీ ఈ స్థాయిలో పొందుతోందని మోదీ అన్నారు. కచ్ ఎడారి పెద్ద సమస్యగా ఉండేదని, దానిని గుజరాత్ కమానుద్వారంగా అభివృద్ధి చేశామని చెప్పారు. గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన, సౌభాగ్యవంతమైన రాష్ట్రంగా గుజరాత్‌ను తీర్చిదిద్దడమే తమ పార్టీ లక్ష్యమని చెప్తున్నారు. ఈ లక్ష్య సాధనకు ప్రజల ఆశీర్వాదాలు కావాలని కోరుతున్నారు.

గుజరాత్‌లోని సౌరాష్ట్రలో అమ్రేలీ, బోటాడ్‌లలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ఆదివారం మాట్లాడనున్నారు. అంతకుముందు ఆయన సోమనాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వెరవల్ పట్టణంలో జరిగిన ప్రచార సభలో కూడా ఆయన మాట్లాడారు. ఆయన గుజరాత్ పర్యటన శనివారం ప్రారంభమైంది. గుజరాత్‌లో 182 శాసన సభ స్థానాలున్నాయి. డిసెంబరు 1, 5 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది, డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు, పలితాల వెల్లడి జరుగుతాయి.

Trump Account Reinstated: డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ రీస్టోర్‭ చేసిన ట్విట్టర్‭.. ట్రంప్, మస్క్‭లపై నెటిజెన్ల ఫన్నీ ట్రోల్స్