Home » టెస్లా చైనా మోడల్ Y SUV సేల్ మొదలైంది.. ఈ నెలలోనే డెలివరీ.. ధర ఎంతంటే?
Published
2 months agoon
Tesla China-made Model Y SUV : ప్రపంచ అతిపెద్ద కారు మార్కెట్లో అమెరికా ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ టెస్లా చైనా మోడల్ కొత్త SUVను తీసుకొచ్చింది. చైనా తయారుచేసిన మోడల్ Y Sport-utiity Vehicles (SUV) సేల్స్ టెస్లా ప్రారంభించింది. 2021 జనవరి 1 (శుక్రవారం) నుంచే అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈ నెలలోనే కస్టమర్లకు డెలివరీ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ మోడల్ వై SUV కార్ల ప్రారంభ ధర చైనాలో 339,900 యాన్స్ (52,091,95) డాలర్లుగా కంపెనీ వెబ్ సైట్లో పేర్కొంది. టెస్లా ప్రపంచ వ్యూహాంలో భాగంగా పెట్రోల్ లేదా డీజిల్ వంటి ఇందన వాహనాలకు బదులుగా కాలుష్య రహిత ఎలక్ట్రిక్ వాహనాలపైనే దృష్టిపెట్టింది.
అందులోనూ చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై భారీగా రాయితీలను అందిస్తోంది. అంతేకాదు.. టెస్లా చైనాలోని షాంఘైలో కారు ఫ్యాక్టరీని విస్తరిస్తోంది. అలాగే మోడల్ 3 సెడాన్స్ నిర్మిస్తోంది. మోడల్ 3 వెహికల్స్ ను యూరోప్ కు ఎగుమతి చేయడాన్ని గత ఏడాది అక్టోబర్ నెలలోనే టెస్లా ప్రారంభించింది. షాంఘైలోని ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల కోసం మ్యానిఫ్యాక్చరింగ్ సామర్థ్యాన్ని పెంచే దిశగా కంపెనీ టెస్లా అడుగులు వేస్తోంది.
కంపెనీ సేల్స్ తో పాటు సర్వీసు నెట్ వర్క్ ను విస్తరిస్తోంది. గత నవంబర్ నెలలో 20వేల కార్లను అమ్మేసింది. చైనాలో టెస్లా కంపెనీతో పాటు వోల్క్ స్వాగెన్ ఏజీ, బీఎండబ్ల్యూ కంపెనీలు కూడా స్థానికంగా తమ ఎలక్ట్రిక్ వాహనాల మ్యానిఫ్యాక్చరింగ్ సైట్లను విస్తరించాయి.