ఆ ఏనుగులకు గంజాయి ఇస్తున్నారు.. ఎందుకో తెలుసా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఈ ఏనుగులు గంజాయి తింటున్నాయా? ఏంటి? ఏనుగుల కోసం ప్రత్యేకించి గంజాయిని తరలిస్తున్నారంట.. అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు.. ఏనుగుల్లో ఒత్తిడిని తగ్గించడానికి ఈ గంజాయిని ఔషధంగా ఇవ్వనున్నారంట..

పోలాండ్, వార్నా జూలో ఏనుగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయంట.. అందుకే అక్కడి జూ అధికారులు ఏనుగుల ఒత్తిడిని తగ్గించేందుకు గంజాయితో చికిత్స అందిస్తున్నారు.. అది కూడా వైద్యపరంగా గంజాయిని వినియోగి స్తున్నామని అంటున్నారు..జూలోని మూడు ఆఫ్రికన్‌ ఏనుగులకు లిక్విడ్ రూపంలో అధిక సాంద్రత కలిగిన రిలాక్సింగ్‌ కెన్నిబినాయిడ్‌ను తొండాల ద్వారా అందించనున్నారు. ఆఫ్రికన్‌ ఏనుగులపై ఇలాంటి పరిశోధనలు చేయటం ఇదే మొదటిసారని అధికారులు అంటున్నారు. వైద్య పరమైన గంజాయి ఏనుగుల ఆరోగ్యంపై ఎలాంటి చెడు ప్రభావం చూపదని చెబుతున్నారు. అంతేకాదు.. ఏనుగుల ఒత్తిడిని తగ్గించటానికి సహజ సిద్ధమైన పద్దతిని ఎంచుకున్నామని జూ అధికారులు చెబుతున్నారు.గత మార్చిలో జూలోని ఆడ ఏనుగు ఎర్నా చనిపోయింది.. అది తీవ్ర ఒత్తిడితో చనిపోయిందని జూ అధికారులు గుర్తించారు.. ఏనుగల గుంపులోని ఫ్రెడ్జియా అనే మరో ఆడ ఏనుగు అప్పటినుంచి ఒత్తిడికి లోనవుతోంది. తోటి ఆడ ఏనుగులతో కూడా కలిసి తిరగడం లేదు.గుంపులోని పెద్ద ఏనుగు చనిపోయినపుడు మిగిలిన ఏనుగులు ఆ బాధనుంచి బయటపడేందుకు కొన్ని నెలలు, సంవత్సరాలు పట్టవచ్చని పరిశోధనల్లో తేలింది. సాధారణంగా పరిశీలిస్తే.. వైద్యపరంగా గంజాయిని కుక్కలు, గుర్రాలకు అందించే చికిత్సలో వాడుతుంటారని అంటుంటారు..

Related Tags :

Related Posts :