లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ఏనుగుపై పెట్రోల్, యాసిడ్‌తో దాడి.. తీవ్రగాయాలతో మృతి

Published

on

Elephant dies after Acid Attack : తమిళనాడులోని నీలగిరి జిల్లా మసినగుడిలో దారుణం చోటుచేసుకుంది. ఏనుగుపై పెట్రోల్, యాసిడ్‌తో దుండగులు దాడి చేశారు.  పొలాల్లో తీవ్రగాయాలతో పడి ఉన్న ఏనుగును స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

యాసిడ్ గాయాలతో బాధపడుతున్న ఏనుగు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందింది. ఏనుగుకు అటవీశాఖ అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. ఏనుగుపై యాసిడ్ దాడి జరిగినట్టు అధికారులు నిర్ధారించారు. గజరాజుపై దాడి చేసినవారి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు.

ఏనుగు మృతికి యాసిడ్ వంటి ప్రమాదకర ద్రావణమే కారణమని తేలింది. యాసిడ్ ను ఏనుగు గొంతు, చెవులు, కళ్లల్లో పోసినట్టు తెలుస్తోంది. ఈ అమానుషానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.