Movies
‘SR కళ్యాణమండపం Est. 1975’
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా.. ‘SR కళ్యాణమండపం Est. 1975’..
Home » ‘SR కళ్యాణమండపం Est. 1975’
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా.. ‘SR కళ్యాణమండపం Est. 1975’..
Published
11 months agoon
By
sekharకిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా.. ‘SR కళ్యాణమండపం Est. 1975’..
‘రాజావారు రాణిగారు’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన కిరణ్ అబ్బవరం హీరోగా, ‘టాక్సివాలా’ చిత్రంతో ఆకట్టుకున్న ప్రియాంక జవాల్కర్ హీరోయిన్గా ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఒక చిత్రం రూపొందుతోంది. ఎలైట్ గ్రూప్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘SR కళ్యాణమండపం – Est. 1975’ అనే టైటిల్ ఖరారు చేస్తూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ద్వారా శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ఒక కళ్యాణమండపం చుట్టూ జరిగే కథతో ఎంతో ఆసక్తిగా రూపొందుతుందని, రాయలసీమ నేపథ్యంలో సాగే వినోదాత్మక అంశాలున్న కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని గొప్పగా చూపించనున్నట్టు దర్శకుడు శ్రీధర్ గాదె తెలిపారు. ఇక ఈ సినిమాలో ‘డైలాగ్ కింగ్’ సాయి కుమార్ హీరో తండ్రి పాత్ర పోషిస్తున్నారు.
మొదటి షెడ్యూల్ శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ మార్చి 13వ తారీఖు నుంచి రాజంపేటలోని అన్నమాచార్య కాలేజీలో జరగనుందని ఎలైట్ టీమ్ వారు తెలిపారు.
నటీనటులు : కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్, తులసి శివమణి, అరుణ్ కుమార్, అనిల్ జీలా, కష్యప్ శ్రీనివాస్. సంగీతం : చేతన్ భరద్వాజ్ , కెమెరా : విశ్వాస్ డేనియల్.
See Also | వర్మ: హీరోలంతా ఎక్కడికిపోయారు? వాళ్లు సరే.. ఇంతకీ నీ హీరోయిన్ ఎప్పుడొస్తుంది!