లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ సాంగ్ ప్రోమో

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబోలో రూపొందుతున్న వాల్మీకి సినిమా నుండి ‘ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో’ సాంగ్ ప్రోమో విడుదల..

Published

on

Elluvochi Godaramma song promo from Valmiki

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబోలో రూపొందుతున్న వాల్మీకి సినిమా నుండి ‘ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో’ సాంగ్ ప్రోమో విడుదల..

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబోలో, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న సినిమా వాల్మీకి.. ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్ అండ్ లిరికల్ సాంగ్స్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమా నుండి ను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు విడుదల చేశారు. నటభూషణ శోభన్ బాబు, అతిలోక సుందరి శ్రీదేవి నటించగా సూపర్ హిట్ అయిన  ‘దేవత’ చిత్రంలోని ఈ పాటను వాల్మీకిలో రీమిక్స్ చేశారు.

అప్పట్లో గోదావరి ఒడ్డున భారీ సంఖ్యలో బిందెలతో ఈ పాటను షూట్ చేశారు. శోభన్ బాబు, శ్రీదేవి వేసిన స్టెప్పులకు ప్రేక్షకులు పరవశించి పోయారు. వాల్మీకిలో వరుణ్ తేజ్ తన ప్రేయసి పూజా హెగ్డేని శ్రీదేవిలా ఊహించుకునే సందర్భంలో ఈ పాట వస్తుందట. వరుణ్ తేజ్, పూజాల గెటప్స్, కెమిస్ట్రీ బాగున్నాయి. ఈ సాంగ్‌ను కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో, యానాం దగ్గర ఇసుక తిన్నెలపై సెట్ వేసి 5 రోజుల పాటు చిత్రీకరించారు. ఒరిజినల్ సాంగ్ ఫ్లేవర్ ఎక్కడా మిస్ అవకూడదని ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారట.

ఈ పాట కోసం 1200 బిందెలను తమిళనాడులో తయారు చేయించడం విశేషం. తమిళ యంగ్ హీరో అధర్వ ఇంపార్టెంట్ రోల్ చేసిన వాల్మీకి సెప్టెంబర్ 20న గ్రాండ్‌గా విడుదల కానుంది. కథ : కార్తీక్ సబ్బరాజ్, స్ర్కీన్ ప్లే : మధు, చైతన్య, కెమెరా : అయాంక బోస్, సంగీతం : మిక్కీ జె మేయర్, ఎడిటింగ్ : చోటా కె.ప్రసాద్, ఆర్ట్ : అవినాష్ కొల్లా, ఫైట్స్ : రామ్-లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : హరీష్ కట్టా.

 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *