లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఒక్క ట్వీట్‌తో 1.10 లక్షల కోట్లు నష్టపోయిన ప్రపంచ కుబేరుడు

Updated On - 1:54 pm, Tue, 23 February 21

Elon Musk Loses 15 billion dollars: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎలన్ మస్క్ మరోసారి తన డబ్బుని చేతులారా పొగొట్టుకున్నాడు. ఒక్క ట్వీట్ తో ఏకంగా 1.10లక్షల కోట్లు లాస్ అయ్యాడు. ఆ ట్వీట్ కారణంగా అమెరికా మార్కెట్లో టెస్లా ఈక్విటీ విలువ ఏకంగా 8.6 శాతం పడిపోయింది. దీంతో ఎలాన్ మస్క్ నికర ఆస్తి విలువ రూ. 1.10 లక్షల కోట్లు (సుమారు 15.2 బిలియన్ డాలర్లు) తగ్గిపోయింది. ఈ దెబ్బతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో నెంబర్ 1 స్థానాన్ని కూడా కోల్పోయాడు.

ఇటీవలి కాలంలో బిట్ కాయిన్ విలువ రోజురోజుకూ పెరుగుతోంది. 50 వేల డాలర్లకు చేరింది. దీనిపై ఎలన్ మస్క్ తన ట్విట్టర్ లో స్పందించాడు, “బిట్ కాయిన్, ఎథర్ క్రిప్టో కరెన్సీ ధర ఎక్కువగా కనిపిస్తోంది” అని ట్వీట్ చేశాడు. అంతే, టెస్లా ఈక్విటీ వాటాలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. దీంతో సంస్థ ఈక్విటీ విలువ పడిపోయింది.

ఎలన్ మస్క్ ఇటీవల బిట్ కాయిన్ లో భారీ పెట్టుబడులు పెట్టారన్న సంగతి తెలిసిందే. త్వరలో బిట్ కాయిన్ పేమెంట్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్న మస్క్, 1.5 బిలియన్ డాలర్ల విలువైన కాయిన్లను కొనుగోలు చేశారు కూడా. కాగా, ఎలన్ మస్క్, తన ట్వీట్ల ద్వారా నష్టం తెచ్చుకోవడం కొత్తేమీ కాదు. గతంలో పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వేల కోట్లను పోగొట్టుకున్నాడు. గతేడాది(2020) డిసెంబర్ నుంచి చూస్తే, టెస్లా షేర్ విలువ భారీగా పతనం అవడం ఇదే తొలిసారి.