లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Business

అయ్యయ్యో ఎంత పనైంది: ఎలన్ మస్క్.. ఫాలోవర్లను ‘సిగ్నల్’ వాడమన్నాడు.. మరో యాప్‌లో షేర్లు కొనేశారు..!

Published

on

Elon Musk told his followers to use Signal : ప్రపంచ అత్యంత ధనవంతుడు, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ తన ట్విట్టర్ ఫాలోవర్లకు ‘సిగ్నల్’ యాప్ వాడాలని సూచించాడు. అయితే ఆయన మాటను ఫాలోవర్లు మరోలా తీసుకోవడంతో పెద్ద పొరపాటే జరిగింది.. సిగ్నల్ మాదిరి యాప్‌లో అమాంతం షేర్లు పెరిగిపోయాయి. ఆయన ఉద్దేశం.. సిగ్నల్ యాప్ ఎన్ క్రిప్టడ్ మెసేజింగ్ యాప్ అని చెప్పాలనుకున్నారు. కానీ, మరోలా ఫాలోవర్లకు అర్థమైంది. సిగ్నల్ యాప్ అనుకుని దాంతో సంబంధంలేని సిగ్నల్ అడ్వాన్స్ యాప్‌లో స్టాక్ ట్రేడింగ్ చేశారు. అంతే.. ఆ యాప్‌లో షేర్లు ఒక్కసారిగా 1,100శాతానికి పెరిగిపోయాయి.

వాస్తవానికి ఈ యాప్‌కు స్టాక్‌తో సంబంధం లేదు. సిగ్నల్ అడ్వాన్స్ అనే చిన్న కంపెనీతో సిగ్నల్ యాప్ కు ఎలాంటి సంబంధం లేదు కూడా. పొరపాటు కారణంగా దీని స్టాక్ ధర రెండు రోజుల్లోనే 12 రెట్లు పెరిగింది. గురువారం (527శాతం) పెరగగా, శుక్రవారం 60శాతం పెరిగి 7.19 డాలర్లు పెరిగింది. కొంతమంది సంబంధం లేని స్టాక్‌ను కొనుగోలు చేయడంతో గతంలో ఇలాంటే అనుభవమే జూమ్ వీడియో, ట్విట్టర్లకు కూడా ఎదురైంది. 2019 ఏప్రిల్ నెలలో జూమ్, ట్విట్టర్ మాదిరి పేర్లను కలిగి ఉన్న సంస్థల్లోనూ గతంలో పొరపాటుగా ఎక్కువ స్టాక్ కొనుగోలు చేసేశారు.


సిగ్నల్ అడ్వాన్స్ అనే కంపెనీని 1992లో Biodyne పేరుతో టెక్సాస్‌లో స్థాపించారు. ఈ యాప్ ద్వారా మెడికల్, లీగల్ వర్కర్లకు సంబంధించి సర్వీసులను అందిస్తుంటుంది. ఇక మస్క్ సూచించిన సిగ్నల్ మెసేజింగ్ యాప్.. స్టాక్ యాప్.. సిగ్నల్ టెక్నాలజీ ఫౌండేషన్ దీన్ని స్థాపించింది. ఈ యాప్ మొత్తం డొనేషన్లపై రన్ అవుతుందంట.