లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

కొవిడ్ టెస్టులు చేసి లైవ్‌లో రిజల్ట్ చెప్పే రోబో.. ప్రపంచంలోనే మొదటిసారి

Published

on

Robo: కరోనావైరస్ వ్యాప్తి పెరుగుతూ ఉంటుండగా టెస్టులు చేయడానికి కూడా వైద్యులు భయపడుతున్నారు. పకడ్బంధీగా జాగ్రత్తలు తీసుకుని టెస్టులు నిర్వహిస్తున్నారు. అది కూడా కొన్ని గంటల సమయం తర్వాత ఫలితాలు వస్తున్నాయి. దీనిని అధిగమించడానికి ఈజిప్ట్ ఇంజినీర్ కొత్త ప్రయోగంతో ముందుకొచ్చాడు. ప్రపంచంలోనే తొలిసారి కరోనా టెస్టులు, ఎక్స్ రేలు లాంటి టెస్టులు చేసే రోబోను కనిపెట్టాడు.

రిమోట్ కంట్రోల్ రోబో సాయంతో ఫలితాలు తెలుసుకోగలగడంతో పాటు మాస్కులు ధరించడం, గ్లౌజులు వేసుకోవడం వంటివి పాటించనవసరం లేదు. పేషెంట్ టెంపరేచర్, కొవిడ్ రిజల్ట్ వంటివి సెకన్లలో చెప్పేస్తుంది. Cira-03 అనే రోబోను మెహమౌద్ ఎల్ కోమీ అనే 26ఏళ్ల ఈజిప్ట్ మెకాట్రానిక్స్ ఇంజినీర్ కనిపెట్టాడు.ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అడ్డుకోవడంతో పాటు వైరస్ నుంచి ఇతరులను కాపాడటం కోసం రోబోను కనిపెట్టారు. ఈ Cira-03 రోబోకు ముఖంతో పాటు మనుషులను పోలిన చేతులు ఉంటాయి. బ్లడ్ టెస్టులు తెలుసుకుని, ఎకోకార్డియోగ్రమ్స్, ఎక్స్‌రేల ఫలితాలు దానికి అంటించి ఉండే స్క్రీన్ లోనే చూడొచ్చు’ అని మీడియా కథనం.

పేషెంట్ గడ్డం పైకెత్తి ముక్కులోని స్వాబ్ ద్వారా కొవిడ్ టెస్టు చేయగలదు. హ్యూమనాయిడ్ రోబో పేషెంట్ల టెంపరేచర్ తెలుసుకుంటుంది. టెస్టులు చేసేటప్పుడు మాస్క్ లు ధరించడం వంటి జాగ్రత్తలు కూడా తీసుకోనవసరం లేదు.

Viral video : ద్యావుడా..లైట్లతో చీర డిజైన్..ఒళ్లంతా వెలుగులేనమ్మా


‘రోబో మనిషిలాగే ఉండాలని అనుకున్నా. అప్పుడే పేషెంట్ భయపడకుండా ఉండగలడు. అప్పుడే బాక్స్ లేదా మెషీన్ ఏదో చేసేస్తుందని భయపడకుండా ఉంటారు. రోబోను మరింతగా నమ్ముతారు. మనుషుల కంటే కచ్చితమైన రిజల్ట్స్ రాబట్టగలవు’ అని ఆయన అంటున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *