పరువు హత్య: నక్కలు తినేసిన శవం.. చెల్లిని హత్య చేసిన అన్న

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పరువు హత్యలో భాగంగా వెలుగు చూసిన షాకింగ్ ఘటన వెనుక విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. స్థానికంగా ఉండే వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలిసి యువతి సోదరుడు హత్య చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన కుటుంబానికి చెందిన బాలిక విషయం.. జిల్లాలోని ధామాగావో దెగ్లూర్ తాలూకాలో ఘటన వెలుగు చూసింది.

కల్పనా సూర్యవంశీ అనే వ్యక్తి కనపడటం లేదని కేస్ ఫైల్ చేశారు. జూన్ 20 నుంచి కనిపించకుండా పోయిన వ్యక్తి జూన్ 22న శవమై కనిపించింది. రికవరీ చేసుకున్న మృతదేహాన్ని నక్కలు సగం తినేసినట్లుగా గుర్తించారు. పోలీసులు దీనిని పరువుహత్యగా భావిస్తున్నారు. ఇన్వెస్టిగేటింగ్ అధికారులు మృతురాలి ఇంట్లో నుంచి ఎటువంటి ఫిర్యాదు అందకపోవడంతో అనుమానాలు మొదలైయ్యాయి.

 

అనుమానస్పదంగా గుర్తించి విచారణ చేపట్టడంతో క్రైం సీన్లో ఇన్వాల్స్ అయిన వారందరి గురించి పూర్తి వివరాలు బయటపడ్డాయి. డెడ్ బాడీ దొరికిన అనంతరం కుటుంబం అంత్యక్రియలు చేసేందుకు ముందుకొచ్చింది. బుధవారం బాధితురాలి సోదరుడు అనిల్ సూర్యవంశీ(26) ఘటనలో ప్రధాన వ్యక్తిగా గుర్తించారు.

 

విచారణలో తన కుటుంబానికి వేరొక వ్యక్తితో సంబంధం కలుపుకోవడం ఇష్టం లేకనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడ్ని జూన్ 30వరకూ రిమాండులో ఉంచాలని కోర్టు ఆదేశించింది.