Entha Manchivaadavuraa Pre Release Event

అన్న కోసం తమ్ముడు : ఎంత మంచివాడవురా ప్రీ రిలీజ్ ఈవెంట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి ఎన్టీఆర్ ఒకే వేదికపై సందడి చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ నటించిన న్యూ ఫిల్మ్ ‘ఎంత మంచివాడవురా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. వేడుకకు నందమూరి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన పాటలు, డ్యాన్స్ అదరగొడుతున్నాయి.

శతమానం భవతి ఫేం సతీష్ విగ్నేశ దర్శకత్వం వహించారు. పక్కా ఫ్యామిలీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2020, జనవరి 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే టీజర్, పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. షూటింగ్ పూర్తయ్యింది. అనంతరం ప్రమోషన్స్‌పై చిత్ర యూనిట్ దృష్టి సారించింది. కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటించింది. శరత్ బాబు, సుహాసిని, నరేశ్, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

కళ్యాణ్ రామ్ నటించిన అతనొక్కడే, ఫటాస్ సినిమాలు అంతగా ఆడలేదు. దీంతో ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. శతమానం భవతి చిత్రానికి జాతీయ స్థాయి అవార్డు దక్కించుకున్న సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. 

అయితే..సంక్రాంతి బరిలో బడా బడా హీరోల చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. రజనీకాంత్ నటించిన దర్బార్, మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం సినిమాలు విడుదల కానున్నాయి. భారీ సినిమాల మధ్య ఈ సినిమా రిలీజ్ చేస్తుండడంతో చిత్ర యూనిట్ ఎంత నమ్మకంగా ఉందో అర్థమౌతోంది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలంటే జనవరి 15వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. 

Related Posts