లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Life Style

EPFO హెచ్చరిక : మరో కంపెనీలో చేరారా? UAN తీసుకున్నారా?

Published

on

EPFO Alert! Not providing your UAN to new employer may put you in big trouble

కొత్త కంపెనీలో చేరారా? పాత UAN నెంబర్ ఇవ్వలేదా? అయితే మీ పీఎఫ్ డబ్బులు రావడం కష్టమే. సాధారణంగా ఏ ఉద్యోగి అయినా ఒక కంపెనీ నుంచి మరో కొత్త కంపెనీలో చేరినప్పుడు ముందుగా పాత కంపెనీలో రిజైన్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రిలీవ్ లెటర్ కూడా తీసుకోవాలి. అంతేకాదు.. పాత కంపెనీలో ఇచ్చిన PF అకౌంట్ రిలేటెడ్ UAN నెంబర్ కూడా తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఆ పీఎఫ్ అకౌంట్ నుంచి నగదును విత్ డ్రా చేసుకోవడం జరుగుతుంది. కొంతమంది ఉద్యోగులు పాత కంపెనీ నుంచి మరో కొత్త కంపెనీలో జాయిన్ అవుతారు. 

ఒకవేళ పాత కంపెనీ సదరు ఉద్యోగి రాజీనామా అంగీకరించకపోయినా లేదా రీలివింగ్ ఇవ్వకపోయినా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది ఈపీఎఫ్ఓ సంస్థ. కొత్త కంపెనీలో చేరగానే పాత కంపనీకి సంబంధించిన వివరాలను తప్పనిసరిగా జాయినింగ్ ఫాంలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యమైనది.. పాత కంపెనీలో ఇచ్చిన UAN నెంబర్. ఇది లేకుండా పీఎఫ్ అకౌంట్ వినియోగం సాధ్యపడదు. పాత UAN నెంబర్ ఇవ్వని పక్షంలో కొత్త కంపెనీలో మరో కొత్త UAN నెంబర్ జనరేట్ చేయడం జరుగుతుంది. 

కొత్త రూల్స్ ప్రకారం.. ప్రతి ఉద్యోగికి పీఎఫ్ అకౌంట్లు ఎన్ని ఉన్నప్పటికీ.. ఒకే UAN మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ UAN నెంబర్లు ఉంటే.. పీఎఫ్ అకౌంట్ వినియోగంలో ఇబ్బందులు తప్పవు. ముందుగా పాత పీఎఫ్ అకౌంట్లో నగదు విత్ డ్రా చేసుకోవాలి. లేదంటే UAN నెంబర్ క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. పాత UAN నెంబర్ యాక్టివ్ లో ఉండగా.. కొత్త UAN యాక్టివేట్ కాదు. అప్పటికే మీ KYC.. PAN, Aadhaar నెంబర్లు కూడా వెరిఫై అయి ఉంటాయి. 

కొత్త UAN నెంబర్ తీసుకుంటే.. ముందుగా పాత UAN నెంబర్ డియాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడే కొత్త UAN యాక్టివేట్ సాధ్యపడుతుంది. కానీ పక్షంలో పాత పీఎఫ్ అకౌంట్లో డబ్బులు విత్ డ్రా చేసుకోలేరు. కొత్త కంపెనీలో పాత UAN నెంబర్ ఇస్తే.. పాత పీఎఫ్ అకౌంట్, కొత్త పీఎఫ్ రెండు అకౌంట్లను వినియోగించుకోవచ్చు. అక్కడే పాత పీఎఫ్ అకౌంటులోని నగదు మొత్తాన్ని కొత్త పీఎఫ్ అకౌంట్లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోనే సదుపాయం ఉంది. 

మరో విషయం గుర్తించుకోండి.. పాత కంపెనీలో కేవలం 3ఏళ్లు మాత్రమే పనిచేసి ఉండి.. పీఎఫ్ మొత్తాన్ని విత్ డ్రా చేసుకుంటే ట్యాక్సు చెల్లించాల్సి వస్తుంది. అదే ఐదేళ్ల పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పిరియడ్ లేకుంటే మాత్రం.. పాత కంపెనీలోని సర్వీసు పిరియడ్ లోని అన్ని ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాదు.. పీఎఫ్ విత్ డ్రా అమౌంట్ నుంచి 10శాతం TDS కూడా కోల్పోవాల్సి వస్తుంది. కానీ, ఈ మొత్తం చెల్లించాల్సిన ఆదాయ పన్నుకు చేరుతుంది. ఒకవేళ అధిక పన్ను జాబితాలో ఉంటే మాత్రం ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ (EPS) నుంచి పొందాల్సిన ప్రయోజనాలను కూడా కోల్పోవాల్సిన వస్తుంది. 

ప్రయోజనాలు.. సమస్యలు ఇవే  : 
* మీ ఉద్యోగం మారగానే.. కొత్త కంపెనీలో పాత UAN నెంబర్ ఇవ్వడం మరవద్దు.
* ఒకే UAN నెంబర్ కు పాత, కొత్త రెండు పీఎఫ్ అకౌంట్లు లింక్ అవుతాయి.
* పాత పీఎఫ్ అకౌంట్ నుంచి కొత్త పీఎఫ్ అకౌంట్లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.
* ఫిజికల్ అప్లికేషన్ ఫాం ద్వారా పీఎఫ్ నగదును బదిలీ చేసుకోవచ్చు.
* లేదంటే మీ పాత పీఎఫ్ అకౌంట్లో నగదు స్తంభించిపోతుంది.
* కొత్త UAN ఖాతా తెరిస్తే మాత్రం… యాక్టివేట్ చేయలేరు.. నగదు విత్ డ్రా చేసుకోలేరు.