PF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై వడ్డీ ఇలానే చెల్లిస్తుందంట!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. మీ పీఎఫ్ అకౌంట్లకు చెల్లించే వడ్డీ రేటుపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది.. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ వడ్డీ రేట్లను నిర్ణయించింది. ఇకపై 8.5 శాతం వడ్డీ రేటును చెల్లించనున్నట్టు వెల్లడించింది. వడ్డీ రేట్ల నిర్ణయంతో పీఎఫ్ అకౌంట్ దారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది.ఇప్పుడు పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో 8.15 శాతం వడ్డీని చెల్లిస్తోంది.



ఈ వడ్డీ రేటు పీఎఫ్ అకౌంట్ దారులకు వర్తించనుంది. మిగతా 0.35 శాతం వడ్డీని ఈపీఎఫ్‌వో డిసెంబర్‌లో చెల్లించనుంది. పీఎఫ్ ఖాతాదారులకు రెండు దఫాలుగా వడ్డీ రేట్లను చెల్లించనుంది ఈపీఎఫ్ఓ.. కరోనా వైరస్ ప్రభావంతో ఈపీఎఫ్ఓ ఇన్వెస్ట్ మెంట్లపై లభించే రాబడిపై నెగటివ్ ఇంపాక్ట్ పడిందని పేర్కొంది. అధిక వడ్డీ చెల్లింపు కష్టమని తెలిపింది..రెండు విడతల్లో వడ్డీని ఇన్‌స్టాల్‌మెంట్ల రూపంలో చెల్లించేందుకు ఈపీఎఫ్‌వో రెడీ అయింది. తొలి ఇన్‌స్టాల్‌మెంట్ కింద 8.15 శాతం వడ్డీ చెల్లించనుంది. డిసెంబర్ నెలలో మిగతా 0.35 శాతం వడ్డీ పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తుంది.

రూ .3,629 కోట్లకు పెరిగిన పేటీఎం ఆదాయం.. 40% తగ్గిన నష్టాలు





మార్కెట్ పరిస్థితుల కారణంగా కొన్ని ఇన్వెస్ట్‌మెంట్లను విత్‌డ్రా చేసుకోవడం కుదరడం లేదని EPFO సెంట్రల్ బోర్డు ట్రస్టీ విర్జేశ్ ఉపాద్యాయ తెలిపారు. ఈపీఎఫ్‌వోకు చెందిన ఏ నిర్ణయమైనా ఆమోదం పొందాలంటే సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (CBT) అనుమతి కచ్చితంగా తీసుకోవాలి.



గత ఏడేళ్లలో అతి తక్కువ వడ్డీ రేటును అందిస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలోని వడ్డీ రేటుతో పోలిస్తే 15 బేసిస్ పాయింట్లు తక్కువగా ఉంటుందని అంచనా. ఏదిఏమైనా పీఎఫ్ ఖాతాదారులకు లభించే వడ్డీ రేటు రెండు దఫాలుగా అకౌంట్లలో జమ చేస్తామని ఈపీఎఫ్ఓ వెల్లడించింది.

Related Tags :

Related Posts :