Ernakulam Police Case Registered Against Kerala Film Producer Vaishak Rajan-10TV

హీరోయిన్‌ని చేస్తానని పిలిచి..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వైశాఖ్ రాజన్ అనే మలయాళ నిర్మాత, తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇస్తానని ఒక మోడల్‌ని ఆడిషన్ చెయ్యాలంటూ, తన గెస్ట్‌హౌస్‌కి పిలిపించాడు.

హాలీవుడ్‌లో మొదలైన మీటూ ఉద్యమం చాలా త్వరగా, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ ఇండస్ట్రీలను ఒక ఊపు ఊపింది. వేధింపులు ఎదుర్కొన్న చాలా మంది ఆడవాళ్ళు బహిరంగంగా తమని వేధించిన వారిపై ఆరోపణలు చేసారు. గత కొంత కాలంగా మీటూ కాస్త సైలెంట్‌గా ఉంది. ఇప్పుడు మరో ఊహించని సంఘటన మలయాళ సినీ పరిశ్రలో జరిగడంతో, మల్లూ‌వుడ్‌తో పాటు, మిగతా చిత్ర పరిశ్రమలు కూడా ఉలిక్కి పడ్డాయి. అసలేం జరిగిందంటే, వైశాఖ్ రాజన్ అనే మలయాళ నిర్మాత, తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇస్తానని ఒక మోడల్‌ని ఆడిషన్ చెయ్యాలంటూ, తన గెస్ట్‌హౌస్‌కి పిలిపించాడు.

అవకాశం కోసం ఆశతో వెళ్ళిన మోడల్‌ని, నిర్మాత బలవంతంగా అనుభవించాడు. దీంతో, సదరు బాధితురాలు ఎర్నాకుళం పోలీస్ స్టేషన్‌లో అతనిపై కేసు పెట్టింది. వైశాఖ్ సినిమా బ్యానర్‌పై, చంక్స్, రోల్ మోడల్స్, వెల్‌కమ్ టు సెంట్రల్ జైల్ వంటి హిట్ సినిమాలు ప్రొడ్యూస్ చెయ్యడంతో, బడా నిర్మాతగా మారాడు వైశాఖ్ రాజన్. అతనిపై సెక్షన్376 ప్రకారం కేసు ఫైల్ చేసి, ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని ఎర్నాకుళం పోలీసులు చెప్పారు. 

వాచ్ వీడియో…

Related Posts